5ఏళ్ళ క్రితం వచ్చి.. అందరినీ వెనక్కి నెట్టాడు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో స్పెషలిస్ట్ బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు యుజ్వేంద్ర చాహల్. టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఏ బౌలర్ కు ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం చాలా బాగా తెలుసు. అందుకే ప్రతి మ్యాచ్లో కూడా తనదైన బౌలింగ్తో కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టుకు బ్రేక్ త్రూ అందిస్తూ ఉంటాడు చాహల్ .

 ఈ క్రమంలోనే యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా తో టీ20 సిరీస్ లో రెండు మ్యాచ్ లలో విఫలమైనప్పటికీ మూడో మ్యాచ్లో మాత్రం నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ టోర్నీలో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన చాహల్ ఇక ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ప్రదర్శనపై ఇక ఇప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

 అయితే సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు యుజ్వేంద్ర చాహల్ 2016లో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ టి-20 లోకి అరంగేట్రం చేశాడు. ఇక ఇలా టీమిండియా లో చేరిన కొద్ది రోజులకే అతని బౌలింగ్ మెలకువలతో బ్యాట్స్మెన్లను పెవిలియన్ కు చేర్చి అందరిని ఆకట్టుకున్నాడు. అయితే కేవలం ఐదేళ్ళ క్రితమే టీమిండియా లోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం టీమిండియా తరఫున టి20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు చాహల్. ఈక్రమంలోనే ఇక ఇటీవల ఇదే విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: