న్యూజిలాండ్ జట్టుకు ఊహించని షాక్.. జట్టు నుండి కెప్టెన్ ఔట్?

praveen
కరోనా వైరస్ కారణంగా అటు అన్ని రంగాల్లో ఎంతో ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే అటు క్రికెట్ మ్యాచ్లు కూడా జరగకుండా ఆగిపోయాయ్.  ఎన్నో రోజుల పాటు క్రికెటర్లు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆటగాళ్లను బయో బబుల్ లో ఉంచుతూ కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎంత కఠిన నిబంధనలు మ్యాచ్ నిర్వహిస్తూ   ఉన్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం అటు నిర్వాహకులకు సాగిస్తూనే ఉంది. పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 ప్రస్తుతం న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్లో ఇక న్యూజిలాండ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఇలాంటి సమయంలోనే న్యూజిలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కరోనా వైరస్ బారిన పడ్డాడు.  దీంతో అతడు నేటి నుంచి ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టుకు దూరం అవబోతున్నాడు అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.

 కేన్ విలియమ్సన్ త్వరగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని మళ్లీ జట్టులో చేరాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇక వైరస్ బారినపడి ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరమైన నేపథ్యంలో టామ్ లాథం కెప్టెన్సీ వహిస్తాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అదే సమయంలో ఇక విలియమ్సన్ స్థానంలో రూథర్ఫర్డ్ జట్టులోకి వచ్చినట్లు తెలిపింది. కాగా విలియమ్సన్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండబోతున్నాడు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ జట్టుకు ఇది మరో ఎదురు దెబ్బ అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: