ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే సంచలనం.. షాకింగ్ రికార్డ్?

praveen
ప్రస్తుతం రంజి టోర్నీలో భాగం గా నాకౌట్ మ్యాచ్లు ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే.  ఈ నాకౌట్ మ్యాచ్ లలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నారు. ఐపీఎల్ లో అదరగొట్టిన ఆటగాళ్లు ఇప్పుడు రంజీ మ్యాచ్ లలో కూడా ఇరగదీస్తు..  ఉంటే మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాణించని ఆటగాళ్లు కూడా ఇప్పుడు  రంజీల్లో అదర గొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఎన్నో రికార్డులు కూడా బద్దలవుతున్నాయ్.

 ఇకపోతే ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగం గా ఉత్తరాఖండ్లో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని సాధించింది. ఏకంగా ఏడు వందల ఇరవై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే ఈ విజయం అటు రంజీ క్రికెట్ చరిత్ర లోనే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. రంజీ క్రికెట్ చరిత్ర లోనే కాదు ప్రపంచ ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్ర లో ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. ఈ క్రమం లోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఈ విజయం గురించే చర్చించుకుంటున్నారు.

 795 పరుగుల లక్ష్యం తో బరి  లోకి దిగిన ఉత్తరాఖండ్ ముంబై బౌలర్ల దాటికి 69 పరుగులతో కుప్ప కూలిపోయింది.. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్ర లోనే అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా ముంబై  ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఎలాఇంతకు ముందు 92 యేళ్ల క్రితం 1929- 30 లో షఫీల్డ్ ఫీల్డ్ క్రికెట్ లో న్యూ సౌత్ వేల్స్ క్వీన్స్ల్యాండ్ పై 685 పరుగుల తేడాతో విజయం సాధించటం ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయంగా ఉండగా.. ఇప్పుడుముంబై జట్టు రికార్డును బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: