ఆ రికార్డ్ కు ఎసరు పెట్టిన ఉమ్రాన్.. అదే జరిగితే?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా వెలుగు లోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ నిలకడగా రాణిస్తూ 150 కిలో మీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ అందరి దృష్టిని ఆకర్షించారు అనే చెప్పాలి. ఈ క్రమం లోనే అటు సెలక్టర్ల దృష్టిని కూడా ఆకర్షించి దక్షిణా ఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు.  ఈ క్రమం లోనే అంతర్జాతీయ క్రికెట్లో అతను ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరం గా మారింది.

 ఈ క్రమం లోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీ20 సీరీస్ లో అద్భుతంగా రాణించడానికి ప్రస్తుతం నెట్స్ లో తీవ్రంగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమం లోనే ఇటీవల నెట్ ప్రాక్టీస్ సమయం లో ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి 163.7 కిలో మీటర్ల వేగాన్ని టచ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. అయితే 2003 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ 161.3 కిలో మీటర్ల వేగం తో విసిరిన బంతి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ గా కొనసాగుతోంది.

 20 ఏళ్ల నుంచి ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి. కానీ ఇటీవల ఐపీఎల్ లో అదరగొట్టి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్ మాత్రం రికార్డు బ్రేక్ చేసే లాగా కనిపిస్తున్నారు. ఏకంగా ప్రాక్టీస్ సెషన్లో  163.7  కిలోమీటర్ల వేగం టచ్ చేసింది. ఒక వేళ ఇటీవలే స్టేషన్లో వేసిన బంతి ఇక మ్యాచ్లో పడింది అని అంటే ఇన్నాళ్లు పదిలంగా ఉన్న షోయబ్ అక్తర్ రికార్డు బ్రేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సౌత్ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: