అయ్యో పాపం.. వికెట్ల వీరులు చాహల్, హసరంగా కూడా చెత్త రికార్డు?

praveen
ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవల ఎంతో ఘనంగా జరిగిన ముగింపు వేడుకలు.. నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది.  ఇక ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచింది ఎవరు అంటే చాహల్ అని చెబుతారు ప్రేక్షకులందరూ. అయితే చాహల్ తర్వాత అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న  హసరంగా 26 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక అటు చాహల్ కి హసరంగాకీ కేవలం ఒకే ఒక వికెట్ తేడా అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో బెస్ట్ బౌలర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ ఈ బెస్ట్ బౌలర్స్ ఖాతాలో కూడా ఒక చెత్త రికార్డు చేరిపోయింది అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ లో అత్యధికంగా సిక్సర్లు 31 ఇచ్చిన బౌలర్గా మహమ్మద్ సిరాజ్ టాప్ లో  కొనసాగుతున్నాడు. మొతంగా 514 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రెండవ స్థానంలో 26 వికెట్లతో మెరిసిన హసరంగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్లో ఎక్కడో 30 సిక్సర్లు  సమర్పించుకున్నాడు. మొత్తంగా 430 పరుగులు ఇచ్చాడు.

 ఆ తర్వాత పర్పుల్ క్యాప్ వీరుడు చాహల్ సైతం ఈ లిస్టు లో ఉన్నాడు అని చెప్పాలి.  527 పరుగులు సమర్పించుకున్న 27 సిక్సర్లు  ఇచ్చాడు చాహల్. ఇక ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 473 పరుగులు 23 సిక్సర్లు, కుల్దీప్ యాదవ్   419 పరుగులు 22 సిక్సర్లు ఇవ్వడం గమనార్హం. మరీ ముఖ్యంగా అటు ఐపీఎల్ లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ లుగా కొనసాగుతున్నా చాహల్, హసరంగా సైతం ఎక్కువ సిక్స్ లు ఇచ్చిన బౌలర్లు గా  చెత్త రికార్డును కూడా నమోదు చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: