ఐపీఎల్ : అత్యధిక అవార్డులు అతనికే?

praveen
ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున జోస్ బట్లర్  అటు ఎంతో అద్భుతం గా రాణించాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి మ్యాచ్లో కూడా అదర గొడుతు సూపర్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ రకంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం లో కొనసాగింది అంటే దానికి అటు జోస్ బట్లర్ మెరుగైన ప్రదర్శన కారణం అని చెప్పడం లో అతిశ యోక్తి లేదు. మొత్తం గా 863 పరుగులు సాధించిన జోస్ బట్లర్ ఇక ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా రికార్డు సృష్టించాడు.

 అంతేకాదు ఈ ఏడాది ఏకం గా నాలుగు సెంచరీలు 3 అర్థ సెంచరీలతో అద్భుతమైన ప్రతిభ కనపరిచాడు అని చెప్పడం  లో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం  అనుకున్నంత స్థాయి లో రాణించలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. మరోసారి సెంచరీ చేసి అదర గొడతాడూ అనుకుంటున్న సమయం లో 39 పరుగుల వద్ద  వికెట్ కోల్పోయాడు. చివరికి ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేయడం తో కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది రాజస్థాన్ జట్టు.

 ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడి పోయినప్పటికీ జోస్ బట్లర్ మాత్రం ఎన్నో అవార్డులు సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసినందుకుగాను పదిహేను లక్షలు అందుకున్నాడు. అత్యధికంగా సిక్సర్లు  45  కొట్టినందుకు,  పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా,  మోస్ట్ వాల్యూబుల్   ప్లేయర్ గా నిలిచినందుకుగాను పది లక్షల చొప్పున అందుకున్నాడు జోస్ బట్లర్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా ఉమ్రాన్ మాలిక్ అవార్డు అందుకోవడం గమనార్హం.. ఇలా రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ  బట్లర్ కి మాత్రం భారీగానే ప్రైజ్ మనీ మూట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: