ఐపీఎల్లో : హిస్టరీ క్రియేట్ చేసిన చాహల్?

praveen
సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు కూడా అతడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన ప్రదర్శన చేయలేక టీమిండియాలో చోటు కూడా కోల్పోయాడు. అతనికి ఎన్ని అవకాశాలు వచ్చినా నిరూపించుకోలేడు అనే అపవాదు కూడా అతనిపై వచ్చేసింది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లు పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో అతనికి అవకాశం దొరకడం కష్టమే అనుకున్నారు అందరు. కానీ ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో మాత్రం అతను అద్భుతంగా రాణించిన తీరు చూసి విమర్శకుల నోళ్లు మూసుకుపోయాయి. మొన్నటి వరకు అతని ప్రదర్శన పై విమర్శలు చేస్తూ వేలెత్తి చూపిన వాళ్ళే ఇక ఇప్పుడు చప్పట్లతో ప్రశంసిస్తున్నారు అని చెప్పాలి.

 అతను ఎవరో కాదు టీమిండియా బౌలర్ చాహల్. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ ఎంత మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్లో కూడా ఎంతో కీలకమైన సమయంలో వికెట్లు పడగోడుతూ జట్టు విజయంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్గా కూడా యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు 5 వికెట్ల హాల్ కూడా అందుకున్నాడు చాహల్. ఇక పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కూడా  ప్రైజ్ మనీ అందుకున్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అటు యుజ్వేంద్ర చాహల్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సాధించాడు చాహల్. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వికెట్ పడగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్ 27 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు ఒక సీజన్లో ఇమ్రాన్ తాహిర్ ఇరవై ఆరు వికెట్లు మాత్రమే అత్యధికంగా కొనసాగుతుండగా ఇప్పుడు మాత్రం చాహల్ 27 వికెట్లతో చరిత్ర సృష్టించాడు చాహల్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: