ఐపీఎల్ విజేత ప్రైజ్ మనీ ఎంత.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత ఇస్తారు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఎంతో గ్రాండ్గా ముగింపు వేడుకలు కూడా జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ఐపీఎల్ లో ఎవరు విజయం సాధిస్తారో అన్న చర్చ ప్రస్తుతం కాస్త ఎక్కువగానే జరుగుతుంది.అదే సమయంలో ఐపీఎల్ లో గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంత దక్కుతుంది.. రన్నరప్ గా నిలిచిన జట్టుకు ఎంత ఇవ్వబోతున్నారు. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ లకు ఎంత ఇస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఒక లక్షా 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించ బోతున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. ప్రధాన నరేంద్ర మోడీ కూడా ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రాబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఐపీఎల్ లో ప్రైస్ మనీ  విషయానికి వస్తే ఐపీఎల్ లో విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన జట్టుకు 13 కోట్లు దక్కుతాయ్ అనే చెప్పాలి. ఇక ఈ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలుస్తాడు. ఇక ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా రాజస్థాన్ ఆటగాడు బట్టర్ కొనసాగుతున్నాడు.

 ఈ క్రమంలోనే అతనికి 15 లక్షల ప్రైజ్మనీ దక్కబోతోంది. ఐపీఎల్ లో భాగంగా 16మ్యాచ్ లలో 824 పరుగులు చేశాడు జోస్ బట్లర్. ఈ సీజన్ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కి పర్పుల్ క్యాప్ ఇస్తారు. ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ హసరంగా 26 వికెట్లతో ఉన్నారు. ఫైనల్లో చాహల్ ఒక వికెట్ తీస్తే పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంటాడు. అతనికి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా 15 లక్షల ప్రైజ్మనీ అందుతుంది. బెంగళూరు ఇప్పటికే ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఇక హసరంగా కు అవకాశం లేకుండా పోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: