తన గోతిని తానే తవ్వుకోవడం అంటే ఇదేనేమో.. వైరల్ వీడియో?

praveen
తన గోతిని తానే తవ్వుకున్నాడు అనే సామెత మీరు వినే వుంటారు. ఇక ఈ సామెత కొన్ని కొన్ని ఘటనలకు సరిగ్గా  సరిపోతు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఘటనకు కూడా ఈ సామెత సరిగ్గా సరిపోతుంది అని చెప్పాలి. ఇటీవల క్రికెట్ లో జరిగిన ఓ ఘటన కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ లూ జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ఇటీవలే కౌంటి ఛాంపియన్ షిప్ లో భాగంగా సోమర్ సెట్.. హాంప్ షైర్ మధ్య మ్యాచ్ జరిగింది.

 ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర ఘటన అందరిని అవాక్కయ్యేలా చేసింది. హాంప్ షైర్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్  సోమర్సెట్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసాడు. ఈ క్రమంలోనే ఒక బంతిని గుడ్ లెన్త్ ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ దిశగా  వేసాడు. అయితే క్రీజులో ఉన్న బ్యాట్మెంటన్ టామ్ ఎబెల్ బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి తిరుగుతూ  వికెట్ల వైపు వెళ్లడం చూశాడు. ఈ క్రమంలోనే ఇక బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే ఏకంగా బంతి వికెట్లను తాకింది. బంతిని ఆపేందుకు అతను కాలితో తంతే అది నేరుగా వికెట్లను వెళ్లి తాకింది.

 దీంతో ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయాడు. ఇలా తనకు తాను అవుట్ అయిన టామ్ ఎబెల్ ఎంతో నిరాశతో అటు పెవిలియన్  చేరిపోయాడు అని చెప్పాలి.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోతుంది.  దీంతో ఇది చూసిన వారు తన గోతిని తానే తవ్వుకున్నాడు కదా అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉండడం గమనార్హం. కాగా అప్పుడప్పుడు క్రికెట్ లో ఇలాంటి ఆసక్తికరమైన లూ జరుగుతు క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: