ధోని అలా చేస్తే బెటర్ : షోయబ్ అక్తర్

praveen
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది అద్భుత ఫామ్ ను కొనసాగించింది అన్న విషయం తెలిసిందే.  ధోని ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జడేజా జట్టుని సమర్థవంతంగా ముందుకు నడిపించ లేకపోయాడు. ఈ క్రమంలోనే వరుస ఓటములతో సతమతమైన చెన్నై సూపర్ కింగ్స్  ఇటీవలే ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన రెండవ జట్టుగా నిలిచింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది అన్న దాని కంటే వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోని ఆడతాడా లేదా ఒకవేళ ఆడిన కెప్టెన్గా కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరం గా మారిపోయింది.  40 ఏళ్ళు పైబడిన ధోని కుర్రకారు తో సమానంగా బ్యాటింగ్ చేశాడు. 11 ఇన్నింగ్స్ లో 199 పరుగులు చేసాడు. అది కూడా కీలక సమయంలో చేశాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో ధోని ఆడతాడా లేదా అన్న విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

 ఇక ఇటీవలే పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఇదే విషయంపై మాట్లాడాడు. ధోని కావాలంటే వచ్చే ఏడాది కూడా ఆడొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ధోని ఆటగాడిగా కొనసాగ లేకపోతే చెన్నై జట్టుకు మెంటర్ గా లేదా హెడ్ గా పనిచేయాలని సూచించాడు. ధోని ఎంతో విలువైన ఆటగాడు. ఏ నిర్ణయం అయినా అతడి మీద ఆధారపడి ఉంటుంది. అయితే అతను జట్టులో కలిసి ఆడిన లేదా జట్టుతో కలిసి ప్రయాణించిన చెన్నై జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఎందుకొ ఐపీఎల్ సీజన్ లో చెన్నై జట్టు సీరియస్గా ఉన్నట్లు కనిపించ లేదు  రవీంద్ర జడేజా కు ఎందుకు కెప్టెన్సీ ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. వచ్చే ఏడాది మాత్రం స్పష్టమైన ప్రణాళికతో చెన్నై జట్టు బరిలోకి దిగితే బాగుంటుంది అంటూ షోయబ్ అక్తర్  చెప్పుకొచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ అప్పటికప్పుడు ఏం చేయాలి అనిపిస్తే అది చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: