వారెవ్వా.. చాహల్ అరుదైన రికార్డ్?

praveen
మొన్నటివరకు పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు టీమిండియా సీనియర్ స్పీన్నర్ యుజ్వేంద్ర చాహల్. అతనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు అని చెప్పాలి. దీంతో అతని కెరీర్ ముగిసిపోయింది అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. ఇక చాహల్ కి టీమిండియాలో అవకాశం దొరకడం కష్టమే అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చాహల్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ చేస్తున్న మ్యాజిక్ చూసి అందరూ నోరెళ్ళబెట్టకుండా ఉండలేక పోతున్నారు. మొన్నటి వరకు విమర్శలు చేసిన వారు ఇక ఇప్పుడు పొగడకుండా అస్సలు ఉండలేకపోతున్నారు.

 ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న లెగ్ స్పిన్నర్ చాహల్ ఇక ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. జట్టుకు అవసరమైన ప్రతిసారీ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయంలో  తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతూ ఉండటం గమనర్హం. ఇప్పటివరకు 22 వికెట్లు పడగొట్టి ఇక పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు చాహల్. ఇక ఇటీవలే తన స్పిన్ బౌలింగ్ తో మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.

 ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్ లో 20 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముగ్గురిని అవుట్ చేసిన ఛానల్ 22 వికెట్లు తీసిన బౌలర్ గా టాప్ లో కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో నాలుగు సీజన్లలో 20 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఘనత సాధించాడు. ఒకప్పటి ముంబై ఇండియన్స్ ఆటగాడు ప్రస్తుతం రాజస్థాన్ బౌలింగ్ కోచ్ మలింగా పేరిట ఉన్న రికార్డును చాహల్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఇక కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్ మూడుసార్లు 20 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా  మూడో స్థానంలో కొనసాగుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: