తృటిలో చావు నుంచి తప్పించుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్.. ఏం జరిగిందంటే?

praveen
చావు తప్పి కన్ను లొట్ట పడటం అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ సామెతకు తగ్గ చేదు అనుభవాలు కొంతమందికి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అనుకోని ఘటన కారణంగా ఏకంగా కళ్ళముందు చావును చూసి ప్రాణాల మీద ఆశలు కోల్పోయి క్షణకాలంలో చావు నుంచి బయటపడిన వారు చాలామంది ఉంటారు. ఇక్కడ ఒక ఆస్ట్రేలియా క్రికెటర్ కి ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్ అతని భార్య జెస్సికా డేవిస్ ఇటీవలె తృటిలో చావు నుంచి తప్పించుకొని బయటపడ్డారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో చివరి చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బతికి బయటపడ్డారు.

 కాగా ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్ 6 నెలల గర్భవతి అయిన తన భార్య తో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ కు వెళ్ళాడు. అక్కడ సరదాగా గడిపిన వీరిద్దరూ ఇటీవల ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఇంకో 45 నిమిషాల్లో విమానం  గమ్యస్థానానికి చేరుకుంటుందన్న సమయంలో వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించాడు పైలెట్. ఇక మొదటి ప్రయత్నంలో ఫ్లైట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యాడు. ఇక రెండో ప్రయత్నంలో ఫ్లైట్ ల్యాండింగ్ చేసినప్పటికీ ఆయన పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది  విమానం. అయితే ప్రైవేట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది అని చెప్పాలి.

 ఇక ఈ విషయాన్ని ట్రెవిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. హాలిడే వెకేషన్ సరదాగా గడిపి ఆస్ట్రేలియకు  తిరుగు ప్రయాణం అవ్వడానికి విమానం  ఎక్కాము.   కానీ గంట ప్రయాణంలో 30 నిమిషాలు పూర్తయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాము. నా బిడ్డ లోకాన్ని చూడకుండానే నేను చనిపోతాను ఏమో అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది జెస్సికా  కాగా ట్రెవిస్ హెడ్ ఆస్ట్రేలియా తరపున 2016 లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆసిస్ తరఫున 26 టెస్టులు 40 వన్డే మ్యాచ్లు 17 టి20  మ్యాచ్లు ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: