పాపం.. కేకేఆర్ బౌలర్ కీ అదొక పీడకలే?

praveen
ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్లో భాగంగా ఏకంగా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో జట్టు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా రన్రేట్ మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దూసుకు పోయింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 176 పరుగులు చేసింది. ఈ  క్రమంలోనే  ఒక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.

 ఈ క్రమంలోనే కనీస పోటీ ఇవ్వలేక 101 పరుగులకే కుప్పకూలి ఆలౌట్ అయ్యింది. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది కోల్కతా నైట్రైడర్స్ జట్టు. ఇక లక్నో ఇన్నింగ్స్ సమయంలో శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. అప్పటివరకు కేవలం 142 పరుగుల తోనే కొనసాగుతోంది లక్నో జట్టు. కానీ అంతలో 19 ఓవర్ వేసిన శివ మావి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. శివ మావి బౌలింగ్లో స్టాయినిస్ తొలి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. కానీ నాలుగో బంతికి వికెట్ కోల్పోయాడు.

 ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ తర్వాత రెండు బంతుల్లో 2 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా ఒకే ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లతో 30 పరుగులు పిందుకున్నారు లక్నో బ్యాట్స్మెన్లు. ఇలా ఎంతో నమ్మకం పెట్టుకొని డెత్ ఓవర్ అయిన 19వ ఓవర్ శివ మావికీ బౌలింగ్ అప్పజెప్తే చివరికి కోల్కతా పాలిట విలన్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు కోల్కత్తా బౌలర్లు మూడు సందర్భాల్లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు ఇవ్వడం గమనార్హం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ మూడు సార్లు శివమ్ మావినే బౌలర్ గా ఉండడం గమనార్హం. దీంతో 19 ఓవర్ శివమ్ మావికీ  ఒక పీడకల లాంటిది అని ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: