ఆ ఇద్దరు కలిస్తే.. టీమిండియాకు తిరుగుండదు : హార్భజన్

praveen
సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి ఏడాది కూడా అటు ఫేసర్ల హవా నడుస్తూ ఉండేది. ఎంతో మంది పేస్ బౌలర్లు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంటూ ఉండేవారూ. కానీ ఈ ఏడాది మాత్రం పేస్ బౌలర్ల కంటే స్పిన్నర్లదే ఎక్కువగా హవా నడుస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ప్రస్తుతం టీమిండియా సీనియర్ స్పిన్నర్స్ గా కొనసాగుతున్న చాహల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో మాయ చేస్తూ బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టిస్తున్నారు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్నారు ఇద్దరు ఆటగాళ్ళు.
 కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక ఇద్దరు స్పిన్నర్లు సంధిస్తున్న బంతులకు అటు బ్యాట్స్మెన్ దగ్గర  సమాధానం లేకుండా పోతుంది అని చెప్పాలి. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడు. కాగా ఇప్పటివరకు 10 మ్యాచుల్లో 22 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు చాహల్. అదే సమయంలో  కుల్దీప్ యాదవ్ కూడా 18 వికెట్లు సాధించి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి.

 ఇకపోతే వీరిద్దరి గురించి ఇటీవలే టీమిండియా మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు చాహల్ కుల్దీప్ యాదవ్ లను ఎంపిక చేయాలి అంటూ హర్భజన్ సింగ్ సూచించాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత వీరిద్దరూ ఫామ్ కోల్పోయారు  తర్వాత కొన్ని మ్యాచ్ లకు జట్టుకు దూరమయ్యారూ. గత ఎడాది ప్రపంచ కప్ లో కూడా వీరికి చోటు దక్కలేదు. అయితే టీమిండియా తరఫున అద్భుతంగా రాణించిన కుల్దీప్ చాహల్ భాగస్వామ్యాన్ని సెలక్టర్లు ఎందుకు విడగొట్టారో  నాకు తెలియడంలేదు కుల్ చా ద్వయంను మళ్లీ జట్టులోకి తీసుకురావాలి. ఇద్దరు కలిసి ఆడితే తిరుగు ఉండదు కాబట్టి ప్రపంచ కప్ లో భారత జట్టులో భాగం చేయాలి అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: