అతను నాకు పెద్దన్న లాంటివాడు : కుల్దీప్
ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ఐతే ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే కోల్కతాలో జరిగిన మ్యాచ్ లో కీలక వికెట్లు తీశాడు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ వంటి కీలక బ్యాట్స్మెన్ వికెట్ తీయడం తనకు ఎంతో ముఖ్యం అంటూ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. వికెట్ తీయడంలో సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లలో 18 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు యుజ్వేంద్ర చాహల్.
ఇక ఇటీవల కోల్కతాలో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్ 17 వికెట్లతో రెండో స్థానంలోకి చేరుకున్నాడు. దీంతో పోటీ ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయం పై చర్చ జరుగుతున్న సమయంలో కుల్దీప్ ఛాంపియన్ అంటూ చాహల్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ఇదే విషయంపై స్పందించిన కుల్దీప్ యాదవ్ చాహల్ తో నాకు ఎప్పుడు పోటీ ఉండదు.. అతడు నా పెద్దన్న లాంటి వాడు. ఎప్పుడు నాకు అండగా నిలబడ్డాడు. గాయంతో బాధపడుతున్న సమయంలో నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఈసారి పర్పుల్ క్యాప్ అతడే గెలుస్తాడని అనుకుంటున్నా అంటూ కుల్దీప్ యాదవ్ చాహల్ పై అభిమానాన్ని చాటుకున్నాడు..