అంత సీన్ లేదు అన్న ఆటగాళ్లే.. అదరగొడుతున్నారు?

praveen
ఈసారి ఐపీఎల్ లో అందరి అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తారు అనుకున్న ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. అదర గొడతారు  అనుకున్న ఆటగాళ్లు మాత్రం  ప్రదర్శనతో నిరాశపరుస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

 ఈసారి కొత్తగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. కెప్టెన్ గా  కూడా మారిపోయాడు. గత రెండేళ్ల నుంచి ముంబై తరఫున ఏమాత్రం ఆకట్టుకోలేక పోయినా హార్దిక్ పాండ్యా ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. గుజరాత్ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

 2019 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న శివమ్ దూబే రాజస్థాన్ తరఫున ఒక్క మ్యాచ్లో మాత్రమే మెరిసాడు. పేలవా ప్రదర్శనలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతూ ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతున్నాడు. ఇక అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్లకు పరుగులు చేయగా చెన్నై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్నాడు.

 సీనియర్ ఫేసర్ ఉమేష్ యాదవ్ గత ఏడాది టి-20లో ఆడలేదు. మరోవైపు టీం ఇండియా తరఫున అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయ్. ఇలాంటి సమయంలో మెగా వేలంలో కోల్కతా జట్టులోకి వెళ్ళిన ఉమేష్ యాదవ్ తన బౌలింగ్లో అదరగొడుతున్నాడు.  కొలకత్తా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు.

 పేలవ ప్రదర్శన కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన కుల్దీప్ యాదవ్ ఇక ఇప్పుడు తన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతున్నాడు. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న కుల్దీప్ యాదవ్  ఐపీఎల్ 2022 సీజన్ లో మాత్రం  ఇప్పటివరకు ఆడినా 4 మ్యాచ్ లలో 10 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ లలో మూడవ స్థానంలోకొనసాగుతూ ఉన్నాడు కుల్దీప్ యాదవ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: