హార్థిక్ పాండ్యా కన్ను పడింది.. వికెట్ విరిగింది?

praveen
ఇటీవల ఐపీఎల్ 2022  సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్  రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ మ్యాచ్లో భాగంగా 87 పరుగులతో రాణించాడు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. తన జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇకపోతే టైటన్స్ విజయాలకి  మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రేక్ వేసినప్పటికీ మళ్లీ గుజరాత్ జట్టు మాత్రం అద్భుతంగా పుంజుకుంది అనే చెప్పాలి. కాగా ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

 హార్దిక్ పాండ్యా కసితీరా ఎలా అయితే బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేశాడో అటు ఫీలింగ్ లో కూడా అదే రేంజ్ లో విరుచుకుపడ్డాడు. హార్దిక్ పాండ్యా  ఒక రన్నవుట్ కోసం బుల్లెట్ వేగంతో బంతిని విసరడంతో ఏకంగా మిడిల్  వికెట్ రెండు ముక్కలు అయిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక హార్దిక్ పాండ్యా విసిరిన బుల్లెట్ వేగం బంతితో అటు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రనౌత్  అయ్యి  వెనుతిరిగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన రాజస్థాన్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో చోటుచేసుకుంది అని చెప్పాలి. పెర్గ్యూసన్  బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఈ ఓవర్లో మూడు బంతిని సంజు శాంసన్ మంచి షాట్ ఆడేందుకు  ప్రయత్నించాడు.

 ఈ క్రమంలోనే షాట్ సరిగా కనెక్ట్ కాలేదు. అయితే సింగల్ తీయడం కాస్త రిస్క్ అని తెలిసినప్పటికీ కూడా అనవసరంగా పరుగులు తీశాడు. అప్పటికే బంతిని అందుకున్న గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మెరుపువేగంతో డైరెక్ట్ త్రో వేశాడు. సంజు శాంసన్ క్రీజులోకి దాటి వచ్చే లోపే బంతి వికెట్లను తాకింది. హార్దిక్ పాండ్యా బంతిని ఎంత బలంగా త్రో విసిరాడు ఏమో తెలియదు కానీ  మిడిల్ వికెట్ విరిగిపోయింది.ఇలా మ్యాచ్ మొత్తంలో సంజు శాంసన్ ను హార్దిక్ పాండ్యా రనౌట్ చేసిన తీరు హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: