స్మిత్.. ప్రపంచ రికార్డు కొట్టేశాడు?

praveen
ఎన్నో ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది ఆస్ట్రేలియా జట్టు. ఇక ఈ టెస్టు సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పాలి.. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న నాసిరకం పిచ్లపై అటు ఆస్ట్రేలియా బ్యాటర్లు అందరూ రెచ్చిపోయి మరి బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రికార్డుల హోరు సృష్టిస్తున్నారు. అయితే తొలి రెండు మ్యాచ్ లలో ఫలితం లేకపోవడంతో ఇక మూడో మ్యాచ్లో గెలవాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా ఆడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల మూడో టెస్టులో భాగంగా ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ కావాజా  సెంచరీతో మెరిశాడు.

 తన కెరీర్లో 12 సెంచరీ సాధించాడు. ఇక ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఏకంగా టెస్టుల్లో అరుదైన మైలురాయిని అందుకన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టెస్టుల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.   ఒక అరుదైన ఘనత సాధించాడు స్మిత్. డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ రికార్డు సాధించడం గమనార్హం. కాగా స్మిత్ 8 వేల పరుగులు చేయడానికి టెస్టుల్లో 151 ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా అత్యంత వేగంగా టెస్టుల్లో 8 వేల పరుగులు అందుకున్న ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు.

 శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర 152 ఇన్నింగ్సులో 8వేల పరుగుల చేసిన ఆటగాడిగా టాప్ లో కొనసాగుతున్నాడు. 12 ఏళ్ల క్రితం టీమిండియాతో జరిగిన మ్యాచ్లో కుమార సంగక్కర ఈ ఫీట్ సాధించాడు. ఇక కుమార సంగక్కర తర్వాత భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇక ప్రస్తుతం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇక స్టీవ్ స్మిత్ ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: