ఐపీఎల్: RCB కెప్టెన్ ఎవరో తేలిపోయింది...

VAMSI
ఐపీఎల్ ఇంకో రెండు వారాలలో అంగరరంగా వైభవంగా మొదలు కానుంది. ఈ ఐపీఎల్ చరిత్రలో దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటి సారిగా ఐపీఎల్ టైటిల్ కోసం మొతం పది జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు తమ సొంత పట్టణాలలో ప్రాక్టీస్ ను మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఐపీఎల్ సీజన్ లో మళ్ళీ తమ సొంత ప్రేక్షకులను అలరించడానికి కొత్త కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంతున్నారు. ఐపీఎల్ హిస్టరీ లో ఇప్పటి వరకు టైటిల్ కొట్టని జట్లలో బెంగుళూరు, ఢిల్లీ మరియు పంజాబ్ లు ఉన్నాయి. ఈసారైనా టైటిల్ గెలిచి తమ 14 సంవత్సరాల కరువు తీర్చుకుందాం అని మూడు జట్లు భావిస్తున్నాయి.
కాసేపటి క్రితం వరకు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ కు సారధిగా ఎవరిని నియమించాలి అన్న విషయంపై అటు ఫ్రాంచైజీ, కోచింగ్ స్టాఫ్ తర్జభర్జనలు పడ్డారు. కెప్టెన్ ఎవరు కానున్నారు అన్న దానిపై నిన్నటి వరకు ముగ్గురి పేర్లు వినిపించాయి. అందులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ మరియు దినేష్ కార్తీక్ పేర్లు వినిపించాయి. కానీ విరాట్ కోహ్లీ ని పలు మార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దినేష్ కార్తీక్ ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్ గా వ్యహరించిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఇతను సక్సెస్ కాలేకపోయాడు. అందుకే ఇతనిని ఎంచుకోవడానికి ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
ఇక ఆఖరి ఛాయస్ గా మిగిలింది ఫాఫ్ డుప్లిసిస్ మాత్రమే. ఇతనికి కెప్టెన్ గా అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన రికార్డు ఉండడంతో ఆర్సీబీ ఇతనిని కెప్టెన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. డుప్లిసిస్ కెప్టెన్ గా ఆడిన 115 మ్యాచ్ లలో 81 మ్యాచ్ లను గెలిపించాడు. ఇప్పుడు ఐపీఎల్ లో బెంగుళూరు జట్టుకు కెప్టెన్ గా టైటిల్ ను అందించగలడా అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: