ఐపీఎల్ మెగా వేలం: ఢిల్లీ క్యాపిటల్స్ మాస్టర్ ప్లాన్... ?

VAMSI
ఐపిఎల్ సీజన్ 15 కు ముందు జరగనున్న మెగా వేలానికి మరో అయిదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఐపిఎల్ ఫ్రాంచిజీలు తమకు ఏ ఆటగాళ్ళు కావాలో ఒక క్లారిటీ తో ఉన్నారు. గతంలో తమ జట్టులో ఉండి బాగా రాణించిన వారిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా గత సీజన్ లో అద్భుత ప్రదర్శనతో టేబుల్ టాపర్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ప్రణాళికతో వేలానికి వెళ్లనున్నారు. ఆ జట్టు మెంటార్ గా ఉన్న రిక్కీ పాంటింగ్ సూచనల మేరకు యాజమాన్యం ఇద్దరు ఆటగాళ్లను మాత్రం ఎలాగైనా వేలంలో దక్కించుకోవాలని చూస్తున్నారట.
అందులో ఒకరు ఓపెనర్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ మరియు సౌత్ ఫ్రిక్యా స్పీడ్ స్టర్ కగిసో రబడా లు ఉన్నారు. వీరిద్దరూ గత కొంత కాలంగా ఢిల్లీ తరపున నిలకడగా రాణిస్తున్నారు. అందుకే ఢిల్లీ యాజమాన్యం వీరిద్దరిపై దృష్టి పెట్టింది. ఈ సారి కూడా ధావన్ పృథ్వి షా లను ఓపెనర్లుగా పంపాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారట. మరియు ఇప్పటికే సౌత్ ఆఫ్రికా తాజా సంచలనం అన్రిచ్ నార్జే ను ఢిల్లీ అంటి పెట్టుకుంది. అతనికి తోడుగా రబాడాను కొననుంది. వీరిద్దరూ ఒకటైతే ప్రత్యర్థి బ్యాట్స్మన్ లకు చుక్కలు చూపించడం ఖాయం. అందుకే వేలంలో ఎంత డబ్బు అయినా వెచ్చించి వీరిద్దరినీ కొనడానికి చూస్తున్నారు.
అయితే వీరిద్దరి కోసం మిగిలిన ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే అవకాశం ఉన్నా రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్  వీరిద్దరినీ సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఢిల్లీ వ్యూహం ఫలిస్తుందా? వీరిద్దరినీ తిరిగి జట్టులోకి తీసుకున్నా 2022 ఐపిఎల్ టైటిల్ ను పొందగలరా అన్నది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: