ఐపీఎల్‌ 2022 : ల‌క్నోటీమ్‌ నూత‌న పేరు ఆవిష్క‌ర‌ణ‌.. ఏమిటంటే..?

N ANJANEYULU
ఐపీఎల్ 2022 రెండు కొత్త ప్రాంచైజీలు ల‌క్నో, అహ్మ‌దాబాద్‌ల జోడింపుతో మొత్తం 10 టీమ్‌లు కానున్నాయి. ఈ టోర్న‌మెంట్ 15వ సీజ‌న్ మొత్తం భార‌త్‌లోనే మార్చి చివ‌రి వారం నుంచి మే చివరి వారం వ‌ర‌కురెండు నెల‌ల పాటు కొన‌సాగుతుంది. అయితే ఇందుకు సంబంధించిన ఐపీఎల్ మెగా వేలం ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల‌లో బెంగ‌ళూరులో జ‌రుగ‌నున్న‌ది. అయితే ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఈవెంట్‌కు కొన్ని వారాల ముందు ల‌క్నో జ‌ట్టు పేరును అధికారికంగా ప్ర‌క‌టించింది. మైక్రో బ్లాగింగ్ సైట్‌కు వెళ్లి జ‌ట్టు య‌జ‌మాని, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చైర్మ‌న్ ప్రాంచైజీ నూత‌న పేరును ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌గా ఆవిష్క‌రించారు.
 అదేవిధంగా అత్యంత ప్ర‌జాదార‌ణ పొందిన పేరు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప్ర‌ముఖ క్రీడా పాత్రికేయుడు బోరియా మ‌జుందార్ హోస్ట్ చేసారు. ఇక జ‌ట్టు య‌జ‌మాని డాక్ట‌ర్ సంజీవ్ గోయెంకా మీడియాతో మాట్లాడారు. ప్రాంచైజీకి అద్బుత‌మైన స్పంద‌న ల‌భించిన‌ద‌ని.. బ‌య‌ట‌కు వ‌చ్చిన త్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన పేరు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేరు నిర్ణ‌యించ‌డానికి పోల్ నిర్వ‌హించాం. మాకు అఖండ‌మైన స్పంద‌న ల‌భించింద‌ని తెలిపారు. ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ గ‌తంలో 2016, 2017లో రెండు సీజ‌న్‌ల‌కురైజింగ్ పూణే సూప‌ర్ జెయింట్‌ను క‌లిగి ఉండింది. ఆ స‌మ‌యంలో  మ్యాచ్ ఫిక్సింగ్ జ‌రిగింద‌నే నెపంతో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై రెండు సంవ‌త్స‌రాల పాటు నిషేదం విధించ‌బ‌డింది.
 తొలి సీజ‌న్‌లో దిగ్గ‌జ కెప్టెన్ ఎం.ఎస్‌.ధోని, రెండవ సీజ‌న్‌లో ఆస్ట్రేలియా కీల‌క ఆట‌గాడు స్టీవ్ స్మిత్ నాయ‌కత్వం వ‌హించారు. పూణే 2016లో ఏడ‌వ స్థానంలో నిలిచింద‌ని, అదేవిధంగా 2017 సీజ‌న్‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మై ప‌రుగును క‌లిగి ఉన్నారు. చివ‌రి బాల్ థ్రిల్ల‌ర్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో ఘోర‌మైన ఓట‌మిని చ‌విచూసే ముందు ఫైన‌ల్‌కు చేరుకున్న‌ట్టు గుర్తు చేశారు.
2022 ఐపీఎల్ సీజ‌న్‌కు తిరిగి వ‌స్తున్న‌ప్పుడు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప్ర‌పంచ క‌ప్ విజేత గౌత‌మ్ గంభీర్‌ను త‌మ మెంట‌ర్‌గా నియ‌మించుకున్న‌ది. ప్ర‌స్తుతం భార‌త ప‌రిమిత ఓవ‌ర్ల వైస్ కెప్టెన్ కే.ఎల్‌.రాహుల్ తో పాటు మొత్తం ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఆన్‌బోర్డులోకి తీసుకొచ్చింది. వారిలో  రాహుల్‌,  ర‌వి బిష్ణోయ్‌, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మార్క‌స్ స్టొయినిస్ ఉన్నారు. బెంగ‌ళూరులో జ‌రిగే వేలంలో టీమ్‌ను మ‌రింత ప‌టిష్ట‌మైన ఆట‌గాళ్ల‌తో నింపి అభిమానుల‌కు జోష్‌ను నింప‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: