గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. మరో రికార్డ్?

praveen
నీరజ్ చోప్రా.. పేరు తెలియని భారతీయుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒలంపిక్స్ లో ప్రతిసారి భారత్కు బంగారు పతకం సాధించడం అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగే భారత అథ్లెట్లు కేవలం రజతం కాంస్యం  పథకాలతో మాత్రమే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అసలు భారత్ కు బంగారు పతకం కల నెరవేరుతుందా లేదా అని అందరిలో అనుమానాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ ఒక కుర్రాడు ఏకంగా ఒలంపిక్స్  లో బంగారు పతకం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

 జూవెలిన్ త్రో విభాగంలో తన సత్తా చాటిన నీరజ్ చోప్రా ఏకంగా మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. కొన్ని దశాబ్దాల తర్వాత భారత్కు బంగారు పతకాన్ని అందించాడు నీరజ్ చోప్రా. ఏకంగా విశ్వ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టాడు. దీంతో ఇక నీరజ్ చోప్రా ప్రతిభకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది అని చెప్పాలి. బంగారు పతకం అందించిన బంగారం లాంటి కుర్రాడు పై ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో నీరజ్ చోప్రా దేశవ్యాప్తంగా ఒక సూపర్ హీరోగా మారిపోయాడు.

 అందరూ ఇతని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా వెతకడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు నీరజ్ చోప్రా మరో అరుదైన రికార్డును సాధించాడు. 2021 సంవత్సరం లో గూగుల్లో అత్యధిక మంది వెతికిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలంపిక్స్లో స్వర్ణ పతక విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా టాప్ ప్లేస్లో నిలిచాడు. గూగుల్లో అత్యధిక మంది నీరజ్ చోప్రా కోసమే వెతికారట. ఇక తర్వాతి స్థానంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన షారుక్ ఖాన్ కొడుకు  ఆర్యన్ ఖాన్ నిలిచాడు. తర్వాత పంజాబీ నటి షహనాజ్ గిల్,  శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, టెస్లా సీఈవో ఎలా మస్క్  నిలిచారు  ఆ తర్వాత విక్కీ కౌశల్, పి.వి.సింధు, బజరంగ్ పునియా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: