ద్రవిడ్ నా ఫస్ట్ లవ్.. ఇప్పుడు మళ్లీ క్రికెట్ చూస్తా : హీరోయిన్
అయితే భారత క్రికెట్ లో తనదైన ఆటతీరుతో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. అప్పట్లో నిలకడైన ఆటకు మారుపేరుగా రాహుల్ ద్రవిడ్ ఆట ఉండేది. అంతేకాదు ఇక మైదానంలో ఎంతో కూల్ గా కనిపించే వాడు రాహుల్ ద్రావిడ్. టీమిండియాకు ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించి టీమిండియా క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు. రాహుల్ ద్రావిడ్ కీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువ అని చెప్పాలి. కేవలం రాహుల్ ద్రావిడ్ కోసం మాత్రమే మ్యాచ్ చూసే ప్రేక్షకులు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అలాంటి ప్రేక్షకులలో సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
తాను కూడా అలాంటి అభిమానినే అంటూ చెబుతుంది బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా. ఇటీవలే మీడియా ఛానల్ తో మాట్లాడిన రిచా చద్దా.. యవ్వనదశలో తనకు క్రికెట్ ఆటపై ఎంతో ఆసక్తి ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ ద్రావిడ్ ఆట అంటే ఎంతో ఇష్టమని యువతిగా ఉన్న సమయంలో రాహుల్ ద్రవిడ్ తో ప్రేమలో కూడా పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ తాను కూడా క్రికెట్ ఆటను చూడటం మానేశా అంటూ తెలిపింది. ఇక ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ మళ్లీ టీమిండియాతో కలిసి చూడటం ఆనందంగా ఉందని ఇప్పుడు మళ్ళీ క్రికెట్ చూడటం మొదలు పెడతాను అంటూ చెప్పుకొచ్చింది రిచా చద్దా.