బాక్సింగ్ లో రాణించిన.. తెలుగు బంగారం.. !

Chandrasekhar Reddy
తాజాగా హర్యానాలో జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పోటీలు జరిగాయి. ఇందులో తెలుగు అమ్మాయి బంగారు పతకం సాధించింది. తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ 50-52 కేజీల కేటగిరిలో ఆఖరి పోటీలో 4-1 తేడాతో ప్రత్యర్థి (హరియాణా) మీనాక్షి పై ఘన విజయం సాధించింది. ఈ పోటీలో గెలిచి బంగారు పతకం సాదించడంతోపాటుగా ఉత్తమ బాక్సర్ గా అవార్డు కూడా గెలుచుకుంది. ఇక్కడ గెలుపు అందుకోవడంతో నేరుగా డిసెంబర్ లో జరుగనున్న టర్కీ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగంలో పోటీకి అర్హత లభించినట్టు అయ్యింది.
జాతీయ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం గెలుచుకున్న వారికి నేరుగా ప్రపంచ స్థాయి పోటీలలో భారత్ తరుపున అదే అవకాశం లభిస్తుందని భారత బాక్సింగ్ సమాఖ్య స్పష్టం చేసింది. అలాగే టర్కీలో జరిగిన పోటీలలో తెలంగాణ అమ్మాయి నిహారిక(60-63 విభాగం)లో కాంస్యం గెలుచుకుంది. ఇలా భారత్ లో మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోతున్న విషయం తెలిసిందే. అర్హత ఉంటె చాలు ఎంత వరకైనా వెళ్లొచ్చు అనేది వీళ్లు నిరూపిస్తున్నారు. తాజా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మహిళల హక్కులకు భంగం కలుగుతూనే ఉన్న నేపథ్యంలో ఇలాంటి విజయాలు ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకం కానున్నాయి.
తాలిబన్ రాకతో మహిళలపై మరోసారి వివక్ష అంతర్జాతీయంగా పెరిగిపోయే ఆవాసకాలు కనిపిస్తున్నాయి. దానికి సమాధానంగా ఈ విజయాలు అక్కడ హక్కుల కోసం పోరాడుతున్న వారిలో కూడా స్ఫూర్తిని నింపగలవు. సాంకేతికత మనిషి వస్తువులు ఇస్తుపోతున్నాడు తప్ప తమ మనసుకు మాత్రం ఇంకా ఆ పాత బూజును మాత్రం వదిలించుకోలేకపోతున్నాడు అనేది తాలిబన్ లాంటి వారిని చుస్తే చెప్పేయవచు. అలాంటి వారే ఉండకూడదని సమసమాజం కోరుకోవాల్సింది పోయి, వాళ్లకు దేశాన్ని అప్పగించి ప్రపంచం చోద్యం చూస్తుండటం విచారకరం. మహిళా స్వేచ్చ నుండి ప్రపంచ శాంతి వరకు ఈ ప్రభావం మరో దశాబ్దం ఉండక మానదు. ఈ విషయాలు ఎప్పుడు ప్రపంచ స్థాయి సంస్థలు అర్ధం చేసుకుంటాయో మరి!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: