ముగిసిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్.. ఒమాన్ టార్గెట్...?

M Manohar
ఈరోజు ఐసిసి టీ20 ప్రపంచ కప్ 2021లో స్కాట్లాండ్ అలాగే పాపువా న్యూ గినియా జట్ల మధ్య క్వాలిఫైయర్ లో భాగంగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు వచ్చిన స్కాట్లాండ్ జట్టుకు మంచి ఆరంభం దొరకలేదు. ఆ జట్టు ఓపెనర్ కెప్టెన్ అయినా కైల్ కోయిట్జర్ ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత మరో ఓపెనర్ జార్జ్ మున్సే 10 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్. ఇక ఆ తర్వాత వచ్చిన రిచీ బెర్రింగ్టన్ వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ తో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దారు. ఈ క్రమంలో మాథ్యూ క్రాస్ 36 బంతుల్లో 45 పరుగులు చేసి అవుట్ కాగా.. కాలమ్ మాక్లీడ్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే అర్థశతకం చేసిన రిచీ బెర్రింగ్టన్ 49 బంతుల్లో 77 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో మైఖేల్ లీస్క్ 9 పరుగులు చేసి అవుట్ కాగా క్రిస్ గ్రీవ్స్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అలాగే ఇద్దరూ మార్క్ వాట్, జోష్ డేవి గోల్డెన్ డక్ అయ్యారు. దాంతో స్కాట్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
ఇక ఆ తర్వాత 166 పరుగులు లక్ష్యంతో వచ్చిన పాపువా న్యూ గినియా మొదట్లోనే ఇచ్చారు .ఇద్దరు ఓపెనర్లు నిరాశపరచగా కెప్టెన్ అసద్ వాలా 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత సెసే బావు  23 బంతుల్లో 24 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక చివర్లో వచ్చిన నార్మన్ వనువా 37 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వికెట్-కీపర్ కిప్లిన్ డోరిగా 11 బంతుల్లో 18 పరుగులు చేయగా చాడ్ సోపర్ 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. చివర్లో నోసైన పోకానా రనౌట్ కాగా జట్టు 19.3 ఓవర్లలో కేవలం 148 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో స్కాట్లాండ్ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించిం.ది అయితే ఈ క్వాలిఫైర్స్ లో వరుస విజయాలు సాధించిన స్కాట్లాండ్ సూపర్ 12 లో  దాదాపు తన బెర్త్ ఖాయం చేసుకున్నట్లే. అలాగే 2 ఓడిపోయిన పాపువా న్యూ గినియా జట్టు తన క్వాలిఫైర్స్ ఆశలను మసకబారేలా చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: