ఇండియన్ ఉమెన్స్ ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ నేడే...

M Manohar
ప్రపంచాన్ని వణికించిన కరోనా తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు మొదటగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. అక్కడి నుండి ఇప్పుడు ఆస్ట్రేలియా కు వెళ్ళింది. అక్కడ భారత మహిళా జట్టు ఆసీస్ మహిళా జట్టు నేడు మధ్య పింక్ బల్ టెస్ట్ జరుగుతుంది. అయితే మన భారత జట్టుకు మాములు టెస్ట్ మ్యాచ్ ఆడటమే అద్భుతం. కానీ ఈరోజు తొలిసారిగా భారత మహిళలు ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ తీసుకోవడంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ కు వచ్చింది. అయితే భారత్-ఆసీస్ మహిళల జట్లు చివరిగా 2006 లో ఈ సాంప్రదాయకమైన సిరీస్ లో పోటీ పడ్డాయి. అంటే 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరెండు జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇక ఈ మధ్యే ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత మహిళలు దానిని డ్రా చేసుకున్నారు. ఆ అనుభవంతో ఆసీస్ పై గెలవాలని ఇండియన్స్ టీం చూస్తుంటే... సొంత మైదానంలో బలమైన పేస్ బౌలింగ్ తో భారత్ పై విజయం సాధించాలని ఆసీస్ అనుకుంటుంది. దానితో పాటుగా ఈ పింక్ టెస్ట్ ఆసీస్ మహిళలకు అనుభవం కూడా ఉంది. చూడాలి మరి ఇక్కడ ఎవరి అనుభవం పని చేస్తుంది అనేది.
భారత జట్టు : స్మృతి మంధన, షఫాలి వర్మ, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్ (c), యస్తికా భాటియా, దీప్తి శర్మ, తనియా భాటియా (wk), పూజా వస్త్రాకర్, జూలన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్
ఆసీస్ జట్టు : అలిస్సా హీలీ (wk), బెత్ మూనీ, మెగ్ ల్యాన్నింగ్ (c), ఎల్లీ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, యాష్‌లీ గార్డనర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, సోఫీ మోలినక్స్, జార్జియా వారెహం, డార్సీ బ్రౌన్, స్టెల్లా కాంప్‌బెల్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: