అస్సలు విడిచిపెట్టొదు.. ప్రతీకారం తీర్చుకోండి : షోయబ్ అక్తర్

praveen
ప్రస్తుతం పాకిస్థాన్లో క్రికెట్ రోజురోజుకీ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు పాకిస్థాన్లో క్రికెట్ ఆడటానికి క్రమక్రమంగా నిషేధిస్తున్నాయి. ఇప్పటికే ఏ జట్టు కూడా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడం లేదు. అయితే ఇటీవలే 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్లో పర్యటించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా అటు ఆ జట్టుతో వరుసగా సిరీస్లో ఆడేందుకు సిద్దం అయింది. కానీ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా తాము పాకిస్తాన్ సీరీస్ ని రద్దు చేసుకుంటున్నాము అంటూ తెలిపింది.

 దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇంగ్లండ్ జట్టు కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది. ఇంగ్లాండ్ మహిళల పురుషుల జట్లు అక్టోబర్లో పాకిస్థాన్లో పర్యటించాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ పర్యటనపై తాము ఏమాత్రం సుముఖంగా లేము అంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ విదేశీ క్రికెట్ బోర్డులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ స్పందించాడు.

 ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకోవడానికి కేవలం న్యూజిలాండ్ మాత్రమే కారణం అంటూ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవలే షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు మనల్ని రిజెక్ట్ చేసింది. అయినా ఏం పర్వాలేదు. టి20 వరల్డ్ కప్లో కలుసుకుందాం ముఖ్యంగా బ్లాక్ క్యాప్స్ ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం పంజా విసిరాల్సిన సమయం వచ్చింది. ఇక న్యూజిలాండ్ జట్టును అస్సలు వదిలిపెట్టొద్దు బాబర్ అజమ్ అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఇలా పాకిస్తాన్ క్రికెట్ ను అవమానించిన జట్లపై వరల్డ్ కప్ లో  పైచేయి సాధించి ప్రతీకారం తీర్చుకోవాలి అని సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: