మళ్లీ నిరాశ పరిచిన కెప్టెన్..!

Podili Ravindranath
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉన్నట్లా... లేనట్లా... ఇదే ఇప్పుడు క్రికెట్ లవర్స్ మదిని తొలిచేస్తున్న ప్రశ్న. అవును కొద్ది రోజులుగా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ చూసిన ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. అసలు మన కోహ్లీ యేనా అని కూడా చాలా మంది అనుమానం. ఎందుకంటే... పరుగుల యంత్రం... రన్ మెషిన్ అనే పేరున్న విరాట్ కోహ్లీ.... వరుస సెంచరీలతో చెలరేగిపోయాడు. ఇంకా చెప్పాలంటే... విరాట్ క్రీజ్‌లోకి వస్తున్నాడంటేనే... ప్రత్యర్థి బౌలర్లకు దడ. చేస్తే హాఫ్ సెంచరీ... లేదా సెంచరీ... ఇదే రన్ మెషిన్ టార్గెట్. కెరీర్ ఆరంభంలో వరుస సెంచరీలతో చెలరేగిన ఈ రన్ మెషిన్... ఇప్పుడు సింగిల్ తీయడానికి కూడా నానా పాట్లు పడుతున్నాడు. అసలు క్రీజులో కుదురుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇక ప్రత్యర్థి బౌలర్లకు ఆయన వీక్ నెస్ ఇప్పుడు పూర్తిగా తెలుసు. ఏ పిచ్ పై ఎలా అవుట్ అవుతాడో అని అందరు బౌలర్లు అవపోసన పట్టేశారు. దీంతో పరుగుల యంత్రం కాస్తా... ప్రస్తుతం పరుగు తీసేందుకు కూడా ఇబ్బంది పడుతోంది.
టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత ఎప్పుడో 2019 నవంబర్ 22వ తేదీన అది కూడా పసి కూన బంగ్లాదేశ్ మీద సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ... ఆ తర్వాత శతకం కోసం ఎన్నో పాట్లు పడుతున్నాడు. రెండేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే విరాట్ హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా గతేడాది డిసెంబర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌లో మాత్రం 4 రన్స్ చేసి అవుటయ్యాడు. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఓవల్ టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. అంటే రెండు హాఫ్ సెంచరీల మధ్య ఏకంగా 15 ఇన్నింగ్స్ గ్యాప్ వచ్చింది. అసలు రన్ మెషిన్ అనే పేరు మన కోహ్లీకే ఉందా... అని విరాట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. విరాట్ సారధ్యంలో టీమిండియా కూడా వరుస ఓటముల పాలవుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ పైనల్ మ్యాచ్‌లో కూడా పరుగులు సాధించడంలో కోహ్లీ విఫలమయ్యాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా 96 బంతులాడిన కోహ్లీ... 44 పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: