బంగారు పతకం.. సెంటి మీటర్ దూరం?

praveen
ప్రతి ఒక్క క్రీడాకారుడూ వారి వారి విభాగాల్లో అద్భుతంగా రాణించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నారు.  వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని..  ఎంతో అద్భుతంగా రాణించి మొదటి స్థానంలో నిలవాలని అనుకుంటూ ఉంటారు.  కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న పాటి తేడా మొదటి స్థానాన్ని దూరం చేస్తూ ఉంటుంది  అయితే ఇలా క్రీడాకారులు అద్భుతంగా రాణించినప్పటికి కొన్ని కొన్ని సార్లు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా క్రీడాకారులు బంగారు పథకం గెలవడానికి ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తూ ఉంటారు. కానీ బంగారు పతకం గెలిచే అవకాశం వచ్చినప్పటికీ చిన్న కారణంతో చేజారి పోతే బంగారు పతకం గెలవాల్సిన క్రీడాకారిణి వెండి పతకంతో సరిపెట్టుకోవాలసి వస్తే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.

 ఇక్కడ ఓ క్రీడాకారులకు ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది  కేవలం సెంటీ మీటర్ దూరం  బంగారు పతకాన్ని దూరం చేసింది. దీంతో  ఆ యువతి వెండి పతకంతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అండర్ 20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో అటు భారత్కు చెందిన ఎంతో మంది యువ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల భారత్ లాంగ్జంప్ విభాగంలో అద్భుతంగా రాణిచింది అని చెప్పాలి. యువ జంపర్  షాలిని సింగ్ చరిత్ర సృష్టించడానికి కేవలం సెంటీమీటర్ల దూరంలో ఆగిపోయింది. బంగారు పతకం చివరికి చేజారిపోయింది.

 ఇటీవలే అండర్ 20 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో లాంగ్ జంప్  విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది షాలిని సింగ్.అయితే  షాలిని సింగ్ అటు స్వర్ణం కోల్పోవడానికి కేవలం సెంటీమీటర్ దూరం మాత్రమే కారణం కావడం గమనార్హం. ఇక ఈ పోటీలలో అటు స్వీడన్కు చెందిన మజా అస్కాగ్  6.60 మీటర్ల దూరం దూకి గోల్డ్మెడల్ సొంతం చేసుకుంది. ఇక పదిహేడేళ్ళ షాలిని సింగ్ 6.59 మీటర్లు లాంగ్జంప్ చేసి రజత పతకాన్ని సాధించింది. ఇక ఒక్క సెంటీమీటర్ తేడాతో వర్ణం కోల్పోవాల్సి వచ్చింది.  ఒకవేళ షాలిని సింగ్ స్వర్ణ గెలిచి ఉంటే సరికొత్త చరిత్రకు నాంది పలికేది అని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే గతంలో కూడా చాలా సార్లు షాలిని జాతీయ రికార్డులు నమోదు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: