నేను ఆప్షన్ గా ఉన్న అంటూ హింట్ ఇస్తున్న డీకే..?

Suma Kallamadi
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. అన్ని రంగాల్లో కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. క్రికెట్ ఆటగాళ్లకు కూడా ఈ కరోనా కష్టాలు తప్పలేదు. ఇండియన్ టీంలో ఇటీవల కొందరికి కరోనా సోకడంతో మూడు రోజుల ప్రాక్టీస్ టెస్ట్ కు వికెట్ కీపర్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దినేష్ కార్తీక్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. క్రికెట్ కిట్ ఉన్న ఫోటో పెట్టి చెప్తున్నానంతే.. అని హింట్ ఇచ్చాడు.
ఇటీవల హాలీడే పీరియడ్ లో ఇంగ్లాండ్ లో ఉన్న ఇండియన్ ప్లేయర్స్ కి కరోనా సోకిందని పంత్, గారనీ పేర్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. మొదట పంత్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. తరువాత సపోర్ట్ స్టాఫ్ మెంబెర్ దయానంద్ గారనీకి కూడా పాజిటివ్ రావడంతో మరో కీపర్ వృద్ధిమాన్ సాహా ఐసొలేషన్ లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం క్వారంటైన్ ఉన్న రిషబ్ పంత్ కోలుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. లండన్ లోని అతని స్నేహితుల వద్ద పంత్ ఉంటున్నాడని అధికారులు చెప్తున్నారు. వారితో కాంటాక్ట్ అయిన వారిని కూడా ఐసొలేషన్ లో ఉంచారు.
ఇదిలా ఉంటె దినేష్ కార్తీక్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఓ కామెంటేటర్ గా వ్యవహరించేందుకు వెళ్ళాడు. ఈ వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు కామెంటేటర్ గా అతడు వ్యవహరించాడు. మూడు రోజుల ప్రాక్టీస్ టెస్ట్ లో భాగంగా జట్టులో కీపర్ ప్లేస్ ఖాళీ అవ్వడంతో దినేష్ కార్తీక్ నేను ఉన్నా అంటూ హింట్ ఇస్తున్నాడు. బీసీసీఐ వికెట్ కీపర్ సాహా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, రిజర్వ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ మరో పది రోజులు క్వారంటైన్ లో ఉంటారు అంటూ అధికారులు అఫిసీయల్ స్టేట్ మెంట్ విడుదల చేశారు. జులై 20న మొదలు కానున్న ప్రాక్టీస్ టెస్టుకు కె. ఎల్. రాహుల్ ఒక్కడే ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఈ కష్ట కాలంలో దినేష్ ఆఫర్ ని బీసీసీఐ స్వీకరిస్తుందో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: