రిషబ్ పంత్ కి ఏ వేరియంట్ కరోనా వచ్చిందో తెలుసా?

praveen
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య అటు బీసీసీఐ ఆటగాల్లు అందరినీ బయో బబుల్ పద్ధతిలో ఉంచి ఇక క్రికెట్ మ్యాచ్లు ఆడుతుంది. కానీ ఆటగాళ్లు చేస్తున్న చిన్నపాటి పొరపాటు కారణంగా చివరికి బయో బబుల్ లోకి కూడా కరోనా వైరస్ ప్రవేశిస్తుంది. గతంలో ఐపీఎల్ సమయంలో కూడా ఆటగాళ్లు చేసిన పొరపాట్ల కారణంగా చివరికి కరోనా వెలుగులోకి వచ్చి ఐపీఎల్ వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఇక ఇటీవలే ఇంగ్లాండు టూర్ లో ఉన్న భారత జట్టులో కూడా కరోనా వైరస్ కలకలం సృష్టించింది. భారత జట్టులో కీలక ఆటగాడైనా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కి ఇటీవలే పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. అటు వెంటనే జట్టులోని మరో సభ్యుడు కూడా వైరస్ బారిన పడినట్లు తేలింది.

 ఈ క్రమంలోనే టీమిండియాలో కరోనా భయం పట్టుకుంది.  ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లను ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచారు. గత కొన్ని రోజుల నుంచి వీరితో కలిసి ఉన్నా మిగతా ఆటగాళ్లను  క్వారంటైన్  లో ఉంచారు. కాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 14 వరకు కూడా ఐదు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు చాలా సమయం ఉండడంతో బిసిసిఐ టీమిండియా ఆటగాళ్లకు 20 రోజుల బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ తో కలిసి లండన్ లో చక్కర్లు కొట్టారు టీమిండియా ఆటగాళ్లు. ఈ క్రమంలోనే వింబుల్డన్ మ్యాచులను వీక్షించేందుకు స్టేడియం కి వెళ్ళాడు రిషబ్ పంత్. దీంతో వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.

 జట్టులోని కీలక ఆటగాడు వైరస్ బారిన పడడంతో ప్రస్తుతం టీమిండియా అయోమయంలో పడిపోయింది.అయితే ప్రస్తుతం పంత్ కి  సోకిన కరోనా  డెల్టా వేరియంట్ అని అనుమానిస్తున్నారు వైద్యులు. ఇక ప్రస్తుతం రిషబ్ పంత్ ప్రత్యేక ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ డెర్హం లో కౌంటీ ఎలవెన్ తో భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఇప్పటికే భారత జట్టు కు డెర్హం చేరుకుంది.అయితే టీమిండియా వెంట పంత్, భరత్ అరుణ్, వృద్ధిమాన్ సాహా, అభిమన్యు లాంటి ఆటగాళ్లు వెళ్లలేదు.  రిషబ్ పంత్ కాకుండా మిగతా సభ్యులు అందరికీ మరోసారి ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు నిర్వహిస్తామని అందులో కూడా నెగటివ్ వచ్చిన తర్వాత ఆటగాళ్ళను జట్టులో చేరుస్తామంటూ టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: