టీమిండియాలో కరోనా కలకలం

Podili Ravindranath
ఇంగ్లండ్ పర్యటనలో టీమ్ ఇండియా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.... ఒకరు కరోనా పాజిటివ్ గా తేలారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ట ఫైనల్ తర్వాత 20 రోజుల విరామ సమయంలో నిర్వహించిన కొవిడ్ టెస్ట్ లో ఒకరు  పాజిటివ్ గా తేలారు. యూకేలో డెల్టా వేరియంట్ తో అతను బాధపడ్డాడని.... ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని బీసీసీఐ అధికారి వెల్లడించారు. యూకేలో కేసుల సంఖ్య కారణంగానే అతనికి వైరస్ సోకినట్లు తెలిపారు.
యూకేలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి టీమ్ ఇండియా మెంబర్లను హెచ్చరించారు. వచ్చే నెలలో ఇంగ్లండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ముందు డర్హామ్ లో నిర్వహించే బయోబబుల్ లో టీమ్ ఇండియా క్రికెటర్లు ఉండాల్సి ఉంది. ఇందుకోసం ప్లేయర్స్ అంతా కలిసి డర్హామ్ వెళ్లారు. వీరితో పాటు పాజిటివ్ వచ్చిన క్రికెటర్ కూడా ప్రయాణించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇద్దరు భారతీయ క్రికెటర్లు వైరస్ బారిన పడినట్లు నివేదికలు చెబుతున్నాయి, కాని ఒకరు వెంటనే కోలుకున్నప్పటికీ... మరోకరు మాత్రం జూలై 18 వరకు ఒంటరిగా ఉండాలని వైద్యులు సూచించారు. ఇంగ్లండ్ తో  రెండు సన్నాహక టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు భారత జట్టు లండన్ నుంచి ట్రెంట్ బ్రిడ్జి నుంచి డర్హామ్ వెళ్తుంది. ఈ నెల 20న  కౌంటీ XIతో నాలుగు రోజుల పాటు, చివరి వారంలో ఇంట్రా స్క్వాడ్ తో మరో మ్యాచ్ ఆడుతుంది. జూలై 30 తర్వాత భారత జట్టు నాటింగ్ హామ్ వెళ్తుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే ముందు ఇండియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న ప్లేయర్స్... యూకేలో రెండో డోస్ కూడా తీసుకున్నారు.  ఇంగ్లండ్ లో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నందున యూరో 2020 ఫైనల్ మ్యాచ్ తో పాటు వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ కు కూడా టీమిండియా క్రికెటర్లు దూరంగా ఉన్నారు. బీసీసీఐ సెక్రటరీ షా హెచ్చరికల నేపథ్యంలో జట్టు సభ్యులు పూర్తిగా హోటల్ కే పరిమితమయ్యారు.
వాస్తవానికి, కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది, ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్ ను కూడా బీసీసీఐ వాయిదా వేసింది. రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ వైపు వెళ్లవద్దని కూడా క్రికెటర్లకు బీసీసీఐ సూచించింది.  తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది కూడా. ప్రతి క్రికెటర్ కూడా జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: