క్రికెట్ కోసం ఆస్తులనే అమ్ముకున్న వ్యక్తి ! ఇపుడు ప్లేయర్ ఆఫ్ ది మంత్..!

NAGARJUNA NAKKA
ఈ ఏడాది జూన్ నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు న్యూజిలాండ్ నయా బ్యాటింగ్ సెన్సేషన్ డేవాన్ కాన్వే గెలుచకున్నాడు. జూన్ లో ఇంగ్లండ్ తో టెస్ట్ అంతర్జాతీయ ఎంట్రీ ఇచ్చిన కాన్వే.. అరంగేట్రం టెస్ట్ లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత భారత్ తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ విలువైన పరుగులు చేశాడు. మహిళల విభాగంలో ఇంగ్లండ్ బౌలర్స్ సోఫీ ఈ అవార్డ్ దక్కించుకుంది.  
క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ అంటే ఊపిరి. క్రికెట్ ను డెవాన్ కాన్వేను వేర్వేరుగా చూడలేము. ఎందుకంటే క్రికెట్ లోకి అడుగుపెట్టేందుకు తాను ఎవరూ చేయని పని చేశాడు. శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే తన ఆస్తులను అమ్మేసుకున్నాడు. డెవాన్ కాన్వే.. దక్షిణాఫ్రికాలో జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ పై అమితాసక్తిని పెంచుకున్నఆయన అందులో రాణించేందుకు తెగ కష్టపడ్డాడు.
ఇక 2017 మార్చిలో సొంతగడ్డపై డబుల్ సెంచరీ కొట్టి క్రికెట్ ప్రియుల దృష్టిలో పడ్డాడు. అదే సంవత్సరం  ఆగస్టులో దక్షిణాఫ్రికాను వీడి న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కాడు. వెల్లింగ్టన్‌ కు మకాం మార్చాడు. అక్కడా తన క్రికెట్ కేరీర్‌ను విజయవంతంగా కొనసాగించాడు. విక్టోరియా యూనివర్శిటీ క్రికెట్ క్లబ్లో కోచ్ గా.... బ్యాట్స్‌మెన్‌గా ఒకేసీరు రెండు విధులు నిర్వర్తించాడు.  దుర్భపరిస్థితులను తట్టుకున్నాడు డెవాన్. అంతేకాదు రాటుదేలిన క్రికెటర్లను ఢీ కొట్టి శభాష్ అనిపించుకున్నాడు డెవాన్. జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు.

ఇల్లు.. కారు.. ఇలా అన్నింటినీ క్రికెట్ కోసం దారపోశాడు. క్రమంగా అనుకున్నది సాధించి.. బ్లాక్ క్యాప్ ను ధరించగలిగాడు. తొలి మ్యాచ్ లోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లాంటి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని నిలదొక్కుకున్నాడు. భవిష్యత్తులో ఈ క్రికెటర్ ఎన్నో విజయాలు సాధించాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: