క్రికెట్ ఫాన్స్ కి అదిరిపోయే శుభవార్త.. టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే?

praveen
ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసింది. గత ఏడాది ప్రారంభమైన వరల్డ్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఫైనల్ వరకు చేరుకుంది. ఇటీవలే  ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించి విశ్వవిజేతగా  నిలిచింది. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆకర్షించింది. అయితే ఇక ఇప్పుడు అందరి కన్ను.. టి20 వరల్డ్ కప్ ఫైనల్ గా ఉంది. గత ఏడాది వరల్డ్ కప్ టి20 జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడుతూ వచ్చింది.  దీంతో వరల్డ్ కప్ నిర్వహిస్తారా లేదా అన్నదానిపై అంతట అనుమానాలు నెలకొన్నాయి.

 కానీ వరల్డ్ కప్ ఈ ఏడాది అనుకున్న సమయానికి నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ నిర్వహించడానికి సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేసే పనిలో పడిందట  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.  టి20 వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్  ఇప్పటికే ఖరారైనట్లు ఇటీవలే సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. యూఏఈ వేదికగానే టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని అటు ఐసిసి భావిస్తోందట. అక్టోబర్ 17 నుంచి టి20 వరల్డ్ కప్ కి సంబంధించిన మ్యాచ్ లు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

 ఇక నవంబర్ 14వ తేదీన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుందట. అబు దాబి,షార్జా, దుబాయ్ వేదికగా  అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్ నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో జరగబోయే బీసీసీఐ, ఐసీసీ సమావేశంలో దీనిపై అధికారిక గా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏఈ వేదికగా ఐపీఎల్  నిర్వహించాలని బిసిసిఐ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది   అయితే ఐపీఎల్ ముగియగానే అటు టి20 వరల్డ్ కప్ ప్రారంభించాలని ఐసిసి సమయం తీసుకునే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: