కంబాల‌లో రికార్డులు తిరగ‌రాసుకుంటున్న శ్రీనివాస‌గౌడ‌..8సెక‌న్ల‌లోనే అంత దూరం..

Spyder
ఇండియన్ ఉసేన్‌ బోల్ట్‌గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ మ‌రోసారి త‌న రికార్డును తానే బ‌ద్ధ‌లు కొట్టాడు. గతేడాది జమైకా పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ ఆల్‌టైమ్ 100 మీటర్ల పరుగు రికార్డు 9.58 సెకన్లను బ్రేక్ చేశాడని ఈ శ్రీనివాసుడిని యావత్ భారతం కొనియాడింది. కంబాల పోటీలో అతను తన దున్నలతో 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడని, ఈ లెక్కన 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస్ 9.55 సెకన్లలో పరుగెత్తాడని కీర్తించింది. గతేడాది 9.55 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేసి వార్తల్లో నిలిచిన శ్రీనివాస గౌడ ఇప్పుడు 8.78 సెకన్లలోనే పూర్తిచేసి ఆ రికార్డును తిరగరాశాడు.

ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్‌ తాలూకా పరిధి కక్యపడవ గ్రామంలో మైరాసత్య సంస్థ నిర్వహించిన 125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలోనే పూర్తిచేయగా దాన్ని 100 మీటర్లకు లెక్కగట్టి 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. గతవారమే వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తిచేశాడు శ్రీనివాస గౌడ. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టాడు.త‌మిళనాడులో జల్లికట్టు ఎంత పాపులరో.. కర్ణాటకలో కంబళ అంత పాపులర్. ఇప్పుడీ ప్రాచీన సాంప్రదాయ క్రీడ నుంచి ఓ పరుగుల వీరుడు పుట్టుకొచ్చాడు. ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను తలదన్నే వేగంతో అతను పరుగుతీసిన తీరు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

కేవలం 9.55 సెకన్లలోనే 100మీ. దూరం పరిగెత్తిన అతన్ని.. ఇండియన్ ఉసేన్ బోల్ట్ అంటున్నారు.  క‌ర్ణాట‌క‌లో సాధారణంగా ప్రతీ ఏటా కంబళ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా కంబళ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో ఈ నెల 1న కంబళ పోటీలు నిర్వహించారు. ఇంతకీ కంబళ పోటీ ఏంటంటే.. రెండు గేదెలు లేదా దున్నపోతులతో కలిసి బురద నీళ్లలో పరిగెత్తడం.ఎవరైతే గేదెలను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: