క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ..!

Kothuru Ram Kumar
అంతర్జాతీయ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ అడుగుపెట్టి నేటికి 12ఏళ్లు. కోహ్లీ తన 12ఏళ్లుకెరీర్ లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 890 పాయింట్లు సాధించిన తొలి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. 1998లో సచిన్ టెండూల్కర్ 887 పాయింట్లతో నెలకొల్పిన రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేశాడు. సునీల్ గవాస్కర్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్ల మార్క్‌ని కైవసం చేసుకున్న రెండో భారత క్రికెటర్‌ విరాట్ కోహ్లీ. గవాస్కర్ కెరీర్ బెస్ట్ 916 పాయింట్లు కాగా.. కోహ్లీ బెస్ట్ 922 పాయింట్లు కావడం విశేషం.

అంతేకాదు టెస్టు జట్టు కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా కోహ్లీ నెం.1 స్థానంలో నిలిచాడు. కెప్టెన్‌గా కోహ్లీ ఇప్పటికే 6 ద్విశతకాలు నమోదు చేశాడు. అతని తర్వాత స్థానంలో బ్రియాన్ లారా 5 డబుల్ సెంచరీలతో ముందు వరసలో ఉన్నాడు. వన్డేల్లో వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కోహ్లీ‌ టాప్. సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ని అందుకోగా.. కోహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు.

ఇక వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా మూడు శతకాల్ని కోహ్లీ కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల రికార్డ్‌లో కోహ్లీనే టాప్. కెప్టెన్‌గా 2007, 2008లో ఆరేసి వన్డే సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్నాడు.

అంతేకాక 2017లో కోహ్లీ 1,460 పరుగులు చేయగా.. రిక్కీ పాంటింగ్ 2007 నెలకొల్పిన 1,424 రన్స్ రికార్డ్ బ్రేక్ చేశారు. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్ 100 సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లీ ప్రస్తుతం 70 సెంచరీలతో ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీ మొత్తం 43 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో సగానికిపైగా టీమ్ ఛేదనకు దిగిన సమయంలోనే సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: