ధోని అందించిన ఐదు ఎవర్ గ్రీన్ రికార్డ్స్ ఇవే..!

Kothuru Ram Kumar
భార‌త క్రికెట్ జ‌ట్టుకు సార‌థిగా ఎన్నో గొప్ప, గొప్ప విజ‌యాలు అందించిన ధోని శ‌నివారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. ధోని క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికి అభిమానులందరికి షాకి గురైయ్యారు. దాంతో చాలా మంది క్రికెటర్లు, సినిమా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఈ విషయం పై స్పందిస్తున్నారు. ధోని అభిమానులు అయితే వారి అభిప్రాయాలను తెలుపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మొత్తంగా ధోనీ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ని ఓసారి పరికించి చూస్తే.. ఐదు రికార్డ్‌లు ఎవర్‌గ్రీన్‌గా కనిపిస్తున్నాయి.

అయితే వాస్తవానికి ధోనీ భారత్ జట్టులోకి ఎంట్రీ కొత్తలో అతని కీపింగ్ స్టయిల్‌పై విమర్శలు వచ్చాయి. క్రమంగా ధోనీ తన తప్పిదాల్ని దిద్దుకుంటూ నెం.1 వికెట్ కీపర్‌గా ఎదిగాడు. 2004 నుంచి 2019 వరకూ 538 మ్యాచ్‌లాడిన ధోనీ.. ఏకంగా 195 స్టంపౌట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ధోనీ 2007లో టీమిండియా కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు అందుకున్నారు. 2017 వరకూ ఆ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో 200 వన్డేలు, 60 టెస్టులు, 72 టీ20 మ్యాచ్‌లకి ధోనీ నాయకత్వం వహించాడు. ధోనీ మొత్తంగా 332 మ్యాచ్‌లకి కెప్టెన్‌గా ఉన్నారు. అతని తర్వాత స్థానంలో 324 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఉన్నారు.

అయితే శ్రీలంకతో జైపూర్ వేదికగా 2005లో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 15x4,10x6 సాయంతో ఏకంగా 183 పరుగులు చేసిన ధోనీ.. వికెట్ కీపర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరుతో వరల్డ్‌ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటికీ కీపర్‌గా ధోనీ నెలకొల్పిన ఆ టాప్ స్కోర్ రికార్డ్‌ని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

ధోనీ వన్డేల్లో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు. 350 వన్డేలాడిన ధోనీ 297 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కి దిగి ఏకంగా 84 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచారు. అత్యధిక నాటౌట్ల రికార్డ్‌లో ధోనీ తర్వాత దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ 72 నాటౌట్స్‌తో ఉన్నాడు.

కెప్టెన్‌గాధోనీ  2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన .. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. అతని కెప్టెన్సీలోనే టీమిండియా తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1గా నిలించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: