టీమ్​ఇండియా స్పిన్నర్న్ ను బరువు పెరగమని చెప్పిన.. యువరాజ్ సింగ్

Suma Kallamadi

టీమ్​ఇండియా స్పిన్నర్​ యజువేంద్ర చాహల్.. నేడు(జులై 23) 30వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సోషల్​మీడియాలో శుభాకాంక్షలు చెప్పాడు భారత మాజీ ఆల్​రౌండర్​​ యువరాజ్​ సింగ్​. 'మిస్టర్​ చుహా' అని​ సంభోదిస్తూ.. ఈ ఏడాది కూడా కెరీర్​ విజయవంతంగా కొనసాగించడం సహా కొంచెం బరువు పెరగాలని చమత్కరించాడు యువీ.చాహల్​ లేదా నిన్ను మిస్టర్​ చుహా అని పిలవొచ్చా? నీ ఫన్నీ వీడియోలు, మాటలతో మాకు వినోదాన్ని పంచుతూ, కెరీర్​నూ విజయవంతంగా కొనసాగించాలని భావిస్తున్నాను. నువ్వు కొంచెం బరువు కూడా పెరగాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు యజువేంద్ర చాహల్​"  అని యువరాజ్ అన్నారు.

 

 టీమ్​ఇండియా యువ స్పిన్నర్​ చాహల్​.. ఎన్నో సరికొత్త రికార్డులను నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్​లో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్​గా ఘనత సాధించాడు. అదే ఫార్మాట్​లో 50 వికెట్ల మార్క్​ను వేగంగా అందుకున్న టీమ్​ఇండియా తొలి స్పిన్నర్​గానూ గుర్తింపు తెచుకున్నాడు.2016లో అంతర్జాతీయ కెరీర్​ ప్రారంభించిన చాహల్.. ఐపీఎల్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్​ తరఫున కీలక బౌలర్​గా రాణిస్తున్నాడు.క్రికెట్ లో శుభాకాంక్షలు, పొగడ్తలతో పాటు వెనుక నుంచి వచ్చే తీవ్రమైన పదజాలాలు కూడా ఉంటాయి.బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని 2000 సంవత్సరంలో తొలుత టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా, తర్వాత కెప్టెన్‌గా నియమించడం చాలా కష్టంగా జరిగిందని నాటి సెలక్షన్‌ కమిటి సభ్యుడు, ప్రస్తుత ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ అశోక్‌ మల్హోత్ర వెల్లడించారు. ఇటీవల ఓ స్పోర్ట్స్​ ఛానెల్​తో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన అశోక్‌.. దాదాను కెప్టెన్‌గా చేసే విషయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు.

 

అప్పట్లో లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాక గంగూలీని సారథిగా చేయడం కష్టంగా అనిపించిందా? అని వ్యాఖ్యాత అడగ్గా ఆయన ఇలా బదులిచ్చారు.అయితే, సచిన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక గంగూలీ కన్నా ముందు అనిల్ ‌కుంబ్లే, అజయ్‌ జడేజా ఆ పదవికి పోటీపడ్డారు. అప్పుడా విషయంలో అందరినీ ఒప్పించాల్సి వచ్చింది" అని అశోక్‌ పేర్కొన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: