ఇన్ స్టాగ్రామ్ లో రెండు ఫొటోలతో భర్తకి విషెస్ చెప్పిన సానియా మీర్జా...!

Kothuru Ram Kumar

భారత టెన్నిస్ దిగ్గజాలలో ఒకరైన సానియా మీర్జా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్టు ఒకటి చేసింది. ఆదివారం నాడు ఆమె పెళ్లి రోజు కావడంతో వారి పది సంవత్సరాల ఏళ్ల వైవాహిక జీవితం సందర్భంగా భర్త షోయబ్ మాలి క్ కు "హ్యాపీ యానివర్సరీ" అంటూ విషెస్ ని మీర్జా తెలిపింది. దీనితో పాటు వారిద్దరూ కలిసి ఉన్న రెండు ఫొటోలను పోస్టు చేసింది. అయితే ఆ ఫోటోల గురించి చెబుతూ.. రెండు ఫొటోల మధ్య పోలిక తెలుపుతూ ... "పదేళ్ల దాంపత్య జీవితం ఇలా ఉంటుంది... ' అంచనాలు Vs వాస్తవికత ' (ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ) " అంటూ క్యాప్షన్ ని పెట్టింది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Happy Anniversary @realshoaibmalik 😌🤗 A decade of being married looks like this!! Expectation vs reality 😅😂 Swipe right for reality ➡️

A post shared by Sania Mirza (@mirzasaniar) on


అయితే అక్కడ ఉన్న వాటిలో తొలి ఫొటోను ఉద్దేశించి అంచనాలు ఇలా ఉంటాయనుకుంటే, రెండో ఫొటోలో వాస్తవికత ఇలా ఉంటుందని మీర్జా వివరించింది. ఆ రెండు ఫోటోలు లో మొదటి ఫొటోలో ఉన్న  షోయబ్, సానియా ఎంతో హుందాగా కనిపిస్తుండగా, రెండో ఫొటోలో కొంటెగా కనిపించరు. అయితే మొత్తానికి ఈ ఫొటోలతో సానియా మీర్జా మరోకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్ తరుపున టెన్నిస్ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన సానియా మీర్జా ... పాకిస్థాన్ అల్ రౌండర్ క్రికెటర్ ను పెళ్లాడుతుందని అప్పట్లో ఎవ్వరూ అనుకోలేదు. 

 


అయితే వీరి ఇరువురి మధ్య ప్రేమ చిగురించడమే కాదు, అది ఏకంగా పెళ్లి వరకు వెళ్లింది. అయితే వీరు తమ ప్రేమని ఎంతో గోప్యంగా ఉంచడమే కాకుండా, పెళ్లితో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వీరి ఇరువురి పెళ్లి ఏప్రిల్ 12, 2010 న జరిగింది. వీరికి ఇప్పుడు ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: