కివీస్ ని వదలని సూపర్ ఓవర్ భూతం... సిరీస్ ని కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

Suma Kallamadi
న్యూజిలాండ్‌ ని సూపర్ ఓవర్ గండం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ కారణంగా కొద్దిలో ప్రపంచ కప్‌ ని చేజార్చుకున్న కివీస్ ఆదివారం మరోసారి ఇంగ్లాండ్ జట్టు చేతిలోనే సూపర్ ఓవర్‌ లో ఓడిపోయి టీ - 20 సిరీస్‌ ని చేజార్చుకుంది. వర్షం కారణంగా పదకొండు ఓవర్లకి కుదించిన మ్యాచ్‌ లో రెండు జట్లు సరిగ్గా 146 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీనితో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్‌ లో మాత్రం ఇంగ్లాండ్ ఎక్కువ పరుగులు చేసి గెలిచింది. దీనితో ఐదు టీ - 20ల సిరీస్ కూడా 3-2 తో ఇంగ్లాండ్ గెలిచింది.


న్యూజిల్యాండ్ లోని ఆక్లాండ్ వేదికగా ఈరోజు జరిగిన ఐదో టీ - 20 మ్యాచ్‌ ని వర్షం కారణంగా 11 ఓవర్లకి కుదించారు. దీనితో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (50: 20 బంతుల్లో 3x4, 5x6), కొలిన్ మున్రో (46: 21 బంతుల్లో 2x4, 4x6), టిమ్ సైపర్ట్ (39: 16 బంతుల్లో 1x4, 5x6) సిక్సర్ల వర్షం కురిపించడంతో 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసేసారు. అనంతరం లక్ష్య ఛేదనలో జానీ బెయిర్‌స్టో (47: 18 బంతుల్లో 2x4, 5x6), శామ్ కరన్ (24: 11 బంతుల్లో 2x4, 2x6) చెలరేగడంతో ఇంగ్లాండ్ కూడా సరిగ్గా 11 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో స్కోర్లు సమానంగా ఉండడంతో సూపర్ ఓవర్ ఖచితమైంది.


సూపర్ ఓవర్‌ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 17 పరుగులు చేసింది. టిమ్ సౌథీ వేసిన ఆ ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, జానీ బెయిర్ స్టో చెరొక సిక్స్ బాదారు. అనంతరం లక్ష ఛేదనలో క్రిస్ జోర్దాన్ బౌలింగ్ చేయగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ సైపర్ట్ ఒక ఫోర్ కొట్టి ఔటవగా గ్రాండ్‌హోమ్ అసలుకే తేలిపోయాడు. దీనితో ఆ జట్టు 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక్కడితో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: