ఈ దిష్టిబొమ్మ మీ ఇంటికి అస్సలు పెట్టకండి.. దరిద్రమే..!

MOHAN BABU
మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇతర ఏ వ్యాపార సంస్థల్లో కానీ వారి వారి ఇళ్ల ముందు దిష్టిబొమ్మల అనేవి చూస్తూనే ఉంటాం. అవి పెట్టుకోవడం వలన మనకు దిష్టి తగలదు అనేసి నమ్మకంతో అవి పెట్టుకుంటారు. అసలు దిష్టిబొమ్మ ప్రభావం మనకు చూపిస్తుందా.. దిష్టిబొమ్మల ప్రభావం ఎంతవరకు ఉంటుంది..! దిష్టి బొమ్మలు  అనేవి ఎర్రగా, రాక్షసుల లాగా, నాలుక మీద తెలు బొమ్మలతో చూడటానికి చాలా భయంకరంగా ఉండే విధంగా దిష్టి బొమ్మలుగా పెడుతూ ఉంటారు. కొత్త బిల్డింగ్ ల కానీ లేదా ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ కానీ పెడుతూ ఉంటారు.

కొంతమంది వీధిపోటులకు ఇతరాత్ర వాటికి పెడుతూ ఉంటారు. అసలు దృష్టి అంటే ఏమిటి సైంటిఫిక్గా దానికి ఏదైనా నిరూపణ ఉన్నదా అని చూసుకుంటే సైన్స్ ప్రకారం చూసుకుంటే దానికి కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉన్నాయి. ఎలా అని మనం ప్రతి విషయాన్ని టెస్ట్ ట్యూబ్ లో పెట్టి  చూడలేము. మనం ఏదైనా ఫంక్షన్ ఉంటే బాగా అందంగా రడీ అయ్యి వెళ్ళాక అక్కడ మళ్లీ కొంతమంది చూస్తారు. అక్కడ మీరే చాలా అట్రాక్టివ్ గా ఉన్నప్పుడు అందరు చూసిన సమయంలో, మళ్లీ మీరు ఇంటికి వచ్చాక కాస్త లేజీగా  తయారవుతారు. ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా తలనొప్పి వస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకు తెలియని ఒక వ్యక్తి తదేకంగా మన వైపే చూస్తున్నాడు అంటే మనకు ఎలా ఉంటుంది. చాలా అనుకంఫర్టబుల్ గా  ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆర ఉంటుంది. అలా వారు చూసినప్పుడు అది డిస్ట్రబ్ అవుతుంది. దీంతో వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. దీన్ని మనం టెస్ట్ చేసి టెస్ట్ ట్యూబ్ లో చూపించలేం. అలాగే ఇంట్లో కూడా మనకు ఉండేటువంటి వస్తువులను బట్టి ఎంతమంది చూస్తారు అనే దానిలో నజర్ అనేది క్రియేట్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకుంటాం. జనరల్ గా మనల్ని చూడగానే అట్రాక్షన్ గా కనిపిస్తుంది. పెళ్లి కొడుకు దిష్టి బొట్టు అని పక్కన పెడతారు. అందంగా అలంకరించిన కొన్ని వందల మంది వచ్చాక ముందుగా చూసేది అతన్నే కాబట్టి వధూవరులకు దిష్టి బొట్టు పెడతారు. ఒక ఇంటికి కూడా అలాగే ఉంటుంది ఇంట్లో మనుషులు ఉంటారు ఆ ఇంటికి కూడా ఆరా ఉంటుంది. పంచభూతాలు ఉంటాయి. మనం కొంతమంది ఇంటికి పోతే హ్యాపీగా పడుకోవాలని పిస్తుంది. కానీ కొంతమంది ఇంటికి  పోతే కనీసం ఒక్క క్షణం కూడా ఉండలేక పోతాం. మరి దీన్ని మనం సాంకేతికంగా ఏ విధంగా చెబుదాం. ముఖ్యంగా వాళ్ళు ఇంటి ముందు పెట్టినటువంటి బొమ్మ  దిష్టి బొమ్మ కాదు.

అలా భయంకరంగా ఉండే దాన్ని దిష్టిబొమ్మ అనరు. దిష్టిబొమ్మ అంటే  పూర్వకాలంలో ప్రతి ఇంట్లో  శ్రీ ముఖం పెట్టేవారు. ఈ ముఖం చూడ్డానికి రాక్షసుడిలా  కనిపించిన ఈ శ్రీ ముఖంపై నాలుకపై తేలు, 2 కోరమీసాలు, నుదుటిపై నెలవంక ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే మనకు చూడగానే మన మైండ్ ఆ బొమ్మ పై ఉన్న  సింబల్స్ పైకి వెళుతుంది. దీని ద్వారా మన దృష్టి ఏదైనా ఉంటే ముందుగా ఆ బొమ్మ పైకి వెళుతుంది తప్ప ఆ ఇంటి పైకి వెళ్లదు. ఈ యొక్క శ్రీ ముఖాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లైతే మనకు అన్నీ లాభాలు సుఖమైన జీవన విధానం ఆ ఇంట్లో ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: