వణుకుపుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..2022-23లో వినాశనమేనా..!

MOHAN BABU
 పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే అటువంటి ఘటన గురించి తమ దివ్యదృష్టితో ముందుగానే ఊహించి చెప్పారు. అలాంటి వారిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చాలా గొప్ప వారని చెప్పవచ్చు. మధ్యయుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన దివ్యదృష్టితో ఎంతోమంది మన్ననలు పొందారు. ఆయన కాలజ్ఞానం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నేటికి కూడా జరుగుతూ వస్తున్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్ లో జరగబోయే విషయాలను ముందుగానే గ్రహించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం జరిగిన చాలా సంఘటనలను ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. మరి ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందామా..? వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి చెందిన యోగి. 1608-1693 మధ్యకాలానికి చెందిన వారు. ఆయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్యపురుషుడు. బ్రహ్మం గారి గురించి తెలియని వారంటూ ఉండరు.

అంతటి గొప్ప జ్ఞాని ఆ కాలంలోనే ఈ కాలంలో ఏం జరుగుతుందో ఊహించి చెప్పడం జరిగింది. అందుకే తన కాలజ్ఞానంలో వాటి గురించి ప్రస్తావించారు. మరి ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎన్నో జరిగాయి. నీళ్ళతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే మనం కరెంటు బుగ్గలను వాడుతున్నాం. అలాగే ఎద్దులు  లేకుండా బండ్లు నడిపిస్తారని అని చెప్పారు. అంటే మనం ఎన్నో వాహనాలను నడుపుతున్నాం. కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది  అని చెప్పారు. వీధి బొమ్మలు  రంగులు పూసుకొని రాజ్యమేలుతారు. అంటే సినిమా యాక్టర్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు. రాచరికాలు, రాజుల రాజ్యాలు కూలిపోతాయి. ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతోంది. దేవతా విగ్రహాలు దొంగిలించ బడతాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రావణకాష్టం కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. రావణ రాజ్యం ఎక్కడ శ్రీలంక శ్రీలంక లో అనేక తీవ్రవాద ప్రాబల్యం ఏర్పడి అనేక నష్టాలు జరిగాయి.  గట్టివాడైన పొట్టి వాడు ఒకడు దేశాన్ని పాలిస్తారు అని చెప్పాడు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. కపట యోగులు చాలామంది పెరిగి పోతారు వీరి వల్ల దేశానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. కానీ మన ఇప్పుడు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి అని చెప్పారు.

ఇది కూడా నిజం అవుతుంది కదా మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అడవులను నరికివేసి గ్రామాలు పట్టణాలు నిర్మించు కుంటున్నాం.  అడవి జంతువులు  ఉండే ఆవాసాన్ని మనం నాశనం చేస్తున్న. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పారు అవి జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు చెప్పారు. అదేంటంటే తిరుపతి లో  శ్రీ వారి కుడి భుజం పగులుతుంది అని చెప్పా రు. ఈశాన్య దిక్కు న విష వాయువుతో ఎంతోమంది చనిపో తారు అని ఆయన చెప్పారు. 2024 నాటికి ఆకా శంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: