మీ ఇంట్లో తాబేలు బొమ్మ ఉందా.. అయితే జాగ్రత్త..!

MOHAN BABU
 తాబేలు అనగానే మనకు చెరువుల్లో, సముద్రాల్లో కనిపించే తాబేల్లు గుర్తుకొస్తాయి. కానీ తాబేలుకు చాలా చరిత్ర ఉంది. అందుకే దాన్ని ప్రతిమను మనం ఇంట్లో కానీ, మనకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, షాపులు ఇలా ఏదైనా కావచ్చు మనం ఉపాధి పొందే దగ్గర వీటి ప్రతిమను పెట్టి పూజిస్తారు. ఇందులో కొంత మంది కదిలే తాబేళ్లను కూడా ఇంట్లో పెంచుతుంటారు. వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే తాబేలును పెంచుకోవడం దాన్ని పూజించడం మన భారతీయ సాంప్రదాయం, మన సనాతన ధర్మం, తాబేలు అనేది కూర్మావతారం. మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారం. దశావతారంలో తాబేలు రెండవ అవతారంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా కుర్మా అవతారాన్ని శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కూర్మ దివ్యదేశము అనే ప్రదేశం కూడా ఉంది.

 దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రదేశంలో నక్షత్రం గుర్తు కలిగినటువంటి తాబేలు ఉంటుంది. ఆ నక్షత్ర తాబేలు ఆ గుడి దగ్గర ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. స్వామివారికి అయితే ఏ విధంగా ఆరగింపు చేస్తారు తాబేళ్ల కూడా ఆ విధంగానే ఆరగింపు చేస్తారు. కూర్మము అనేది భారతీయుల యొక్క సంపద. ఇది చైనా వాళ్లది అని చాలా మంది మన భారతీయులు అనుకుంటారు. కానీ అది తప్పు. కూర్మము అనేది భారతీయుల భక్తి సంప్రదాయాల్లో చాలా విశిష్టమైనది.

 అందుకే దీన్ని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర పెట్టుకుంటారు. తాబేలు పూజ చేస్తే మాత్రం మనకు ఆర్థికంగా ఎంత పెద్ద బాధ వచ్చినా, అది మోయలేని భారం అయినా సరే   దాన్ని మోసే, తట్టుకునే శక్తిని ఇస్తుందని ఆధ్యాత్మిక వ్యక్తులు చెబుతున్నారు. చాలామంది కూర్మ ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా  చెప్పాలంటే కూర్మము అంటే తాబేలు పైన ఉన్నటువంటి లేయర్. ఇది చాలా గట్టిగా ఉంటుంది. మనం దాని మీద ఎంత బరువు పెట్టిన ఏం చేసినా కానీ దానికి ఏమి కాదు. దానిలాగే మనం నిత్య జీవితంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా మనం గట్టిగా నిలబడి వాటిని ఎదిరించి తట్టుకోగలం అనేటువంటి ఒక శక్తి రావటానికి కూర్మ పూజ అనేది ఎంతో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: