మకర సంక్రాంతికి కిచ్డీ ఎందుకు ? అసలు ఆ పేరు ఎవరు పెట్టారు ?

Vimalatha
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగ జనవరి 14వ తేదీన వస్తోంది. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం మరియు దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతికి మరో పేరు ఖిచ్డీ. బెల్లం, నెయ్యి, ఉప్పు మరియు నువ్వులతో పాటు పప్పు, బియ్యం దానం చేయడం వంటి వాటికి సంక్రాంతి రోజున ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మినప పప్పు ఖిచ్డీని ఈ రోజున ఇంట్లో స్పెషల్ గా తయారు చేస్తారు. అంతేకాకుండా ప్రజలు ప్రసాదం రూపంలో కూడా కిచ్డీని పంచుతారు. ఈ కారణంగా చాలా ప్రాంతాలలో ఈ పండుగను ఖిచ్డీ అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగకు ఖిచ్డీ అని ఎందుకు పేరు పెట్టారో? దానికి ఖిచ్డీ అనే పేరును ఎవరు పెట్టారో తెలుసుకుందాం.
ఈ సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారు ?
బాబా గోరఖ్‌నాథ్ కాలం నుండి మకర సంక్రాంతి రోజున ఖిచ్డీ తయారు చేయడం ప్రారంభమైందని చెబుతారు. ఖిల్జీతో యుద్ధ సమయంలో ఆహారం సిద్ధం చేయడానికి సమయం లభించలేదని, వారు ఆకలితో యుద్ధానికి వెళ్లేవారని చెబుతారు. అటువంటి సమయంలో బాబా గోరఖ్‌నాథ్ పప్పులు, బియ్యం, కూరగాయలను కలిపి వండమని సలహా ఇచ్చారు. ఎందుకంటే అది వెంటనే సిద్ధం అవుతుంది. దీనితో పాటు, ఇది పోషకమైనది. అదే సమయంలో కడుపు నింపేది.
ఖిచ్డీకి ఎవరు పేరు పెట్టారు?
బాబా గోరఖ్‌నాథ్ ఈ ఇన్‌స్టంట్ న్యూట్రీషియన్ డిష్‌కి ఖిచ్డీ అని పేరు  పెట్టారు. ఖిల్జీ నుండి విముక్తి పొందిన తరువాత యోగులు మకర సంక్రాంతి రోజున పండుగను జరుపుకున్నారు. అదే ఖిచ్డీని ఆ రోజు పంచారు. అప్పటి నుంచి మకర సంక్రాంతికి ఖిచ్డీ తయారు చేసే సంప్రదాయం మొదలైంది. నేటికీ మకర సంక్రాంతి సందర్భంగా, గోరఖ్‌పూర్‌లోని బాబా గోరఖ్‌నాథ్ ఆలయంలో ఖిచ్డీ జాతర జరుగుతుంది. దానిని ప్రజలకు ప్రసాదం రూపంలో పంపిణీ చేస్తారు. మకర సంక్రాంతి రోజున సూర్య దేవుడు తన కొడుకు శని ఇంటికి వస్తాడని నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: