"కైలాస గుడి"ని ఎలా నిర్మించారో తెలుసా ?

VAMSI
మన దేశంలో ప్రసిద్ది చెందిన దేవాలయాలు ఎన్నో కొలువై ఉన్నాయి. వాటిలో  మహారాష్ట్ర స్టేట్ లో ఔరంగాబాద్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస టెంపుల్ ఒకటి. 700 వ సంవత్సరంలో కొన్ని కొండలని చెక్కగా వాటికి ఎల్లోరా కేవ్స్ అని అప్పటి రాజులు దానికి పేరు పెట్టారు. 16 కి.మీ ల విస్తీర్ణము కైలాస్  టెంపుల్ ని వర్టికల్ ఎక్సికుషన్ మెథడ్ లో ఎంతో అద్భుతంగా చెక్కారు. అంటే  పై భాగం నుండి చెక్కడం స్టార్ట్ చేసి మెల్లగా క్రిందికి గుడి మొత్తం చెక్కారు. ఈ గుడిని ఎవరు కట్టారో ఎన్ని సంవత్సరాల పాటు కట్టారో ఇప్పటి కూడా ఎవ్వరికీ స్పష్టమైన వివరాలు తెలియవు. కానీ కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం 7వ శతాబ్దంలో ఈ గుడి కట్టి ఉండొచ్చని  ఒక అంచనా.

 
అయితే  అప్పట్లో సీలలు,  సుత్తి మాత్రమే పనిముట్లుగా ఉన్న కాలంలో ఇంత పెద్ద గుడిని అది గ్రానైట్ కొండను చెక్కి ఎలా నిర్మించగలిగారు అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. అప్పట్లో అంత టెక్నాలజీ వాడటం అన్నది నిజంగా ఒక వింతే. మొత్తం సింగిల్ గ్రానైట్ మీద ఈ గుడిని చెక్కారు మరియు బయటికి తీయడం జరిగింది. 17వ శతాబ్దంలో ఇస్లామిక్ రూలర్ అయినటువంటి ఔరంగజెబ్ హిందువులకు వ్యతిరేకి.. అందువల్ల ఆయన హిందువుల దేవాలయాన్ని కూల్చివేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈ కైలాస టెంపుల్ కూడా  కూల్చివేయాలని ప్రయత్నించాడు కానీ అది ఫలించలేదు. దాదాపు  మూడు సంవత్సరాలు కష్టపడినా కేవలం కొంత భాగాన్ని మాత్రమే పాడు చేయగలిగాడు. అంటే ఆ గుడిని ఎంత దృఢంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు.

ఈ గుడిని పూర్తిగా ధ్వంసం చేయడం వీలు కాక చివరికి విడిచిపెట్టారు. ఏడు వేల మంది పని వాళ్ళు కలసి దాదాపుగా 150 సంవత్సరాల పాటు ఈ గుడిని నిర్మించి ఉంటారని ఒక అంచనా. అంతే కాకుండా ఈ గుడి కైలాసపర్వతం లాగా మంచుతో కప్పబడి ఉండేలా  కనిపించాలని భావించి  వైట్ కలర్ కోట్ ను  కూడా వేశారు. వందల ఏళ్ళు గడవడం  వల్ల ప్రస్తుతం ఆ తెల్లని కోటింగ్ పెద్దగా  కనిపించడం లేదు. ఇలా ఈ గుడి ఎంతో ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: