నరుడిగా పుట్టి.. దైవంగా పూజలు.. శ్రీరాముడు గుణాలు వలనే ఆ గుణాలు ఏమిటంటే..!

Chaganti
రావణుడి సంహారం కోసం నరుడిగా జన్మించిన శ్రీవిష్ణువు ఇప్పుడు దేవుడిగా కొలవబడుతున్నాడు. అన్ని విషయాల్లో రాముడిని ఆదర్శంగా చూపుతూ ఉంటారు. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైనా నిరంతరం అమె కోసం ఆలోచిస్తూ పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చే రాజుగా.. మనిషి ధర్మం తప్పకుండా ఎలా జీవించాలో తానే జీవించి చూపించాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యానికి వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ మూర్తిగా కొలవబడుతున్నాడు. అయితే ముఖ్యంగా రాముడి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన గుణగణాల గురించి మాట్లాడాలి. 

వాల్మీకి రామాయణంలో రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నాయని పేర్కొన్నారు. రాముడిని అనుసరిస్తూ.. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు. ఒక మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా తన ధర్మాన్ని ఎలా నెరవేర్చాలో చూపించి ఆదర్శ పురుషుడు గా శ్రీరాముడు నిలిచాడు. రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా... ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించాడు శ్రీ రాముడు. 

16 గుణాలు పుష్కలంగా కలిగి.. సుగుణాభిరాము డయ్యాడు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకో గలిగినవాడు లాంటి గుణాలు ఆయనకు ఉన్నాయి. మానవ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు అయితే సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక. లక్ష్మణుడు సోదర ధర్మానికి ప్రతీక. అలాగే హనుమంతుడు భక్తికి ప్రతీక. అందుకే ఈ అందరూ ఇప్పటికీ కొలవబడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: