దీపావళి స్పెషల్ : నోరూరించే అరిసెలు

దీపావళి వచ్చేసింది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో..ఇంటినిండా బందువులు, స్నేహితులతో చాలా ఆడంభరంగా జరుపుకొనే దీపావళి. హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి పండుగ రోజున భారతీయులు వివిధ రకాల సంప్రదాయ పిండి వంటలు తయారుచేసుకుంటారు.   చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు. దీపావళి అనగానే ముఖ్యంగా గుర్తువచ్చేది అత్తిరాసము(అరిసెలు). బియ్యంపిండి, బెల్లంతో తయారు చేస్తారు. అందులో కొంచెం వెరైటీ గసగసాలు కలిపితే ఆ టేస్టే వేరు. దీపావళి పండుగ రోజున వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకొని దేవునికి నైవేద్యంగాను సమర్పిస్తారు. 



అరిసెలకు కావలసిన పదార్థాలు:
బియ్యం - ఒక కేజీ
బెల్లం - అర కేజీ
నువ్వులు - 50 గ్రాములు
నూనె - తగినంత


తయారీ విధానం :
ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండిని జల్లించి పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం సరిపడా నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి. అందులో బియ్యం పిండిని వేసి బాగా కలిపి దించేయాలి.  తరువాత స్టౌవ్‌ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిలో నువ్వులు చేర్చి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకుపై ఒత్తుకుని నూనెలో వేసి రెండువైపులా కాలి ఎరుపు రంగు వచ్చాక తీసేస్తే నువ్వుల అరిసెలు రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: