స్మరణ: కొచ్చిన్ హనీఫా గుర్తున్నాడా..?

Divya
సినీ ఇండస్ట్రీలోకి కొంతమంది అడుగు పెట్టి, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు నటించి, సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయినా, హీరోలైన , హీరోయిన్ అయిన ఇలా ఎవరైనా సరే తమ నటనతో, కామెడీతో ప్రేక్షకులను కటుపుబ్బా నవ్వించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుని వెళుతూ ఉంటారు. అలాంటి వారిలో కొచ్చిన్ హనీఫా కూడా ఒకరు. ఇక ఈయన ప్రముఖ సినీ నటుడు మాత్రమే కాదు స్క్రీన్ ప్లే రైటర్ అలాగే దర్శకుడు కూడా. ముఖ్యంగా మలయాళం సినీ ఇండస్ట్రీలో సినిమాలలో హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి . 1972వ సంవత్సరంలో విలన్ పాత్రలో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఈయన వ్యక్తిగత పూర్తి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొచ్చిన్ హనీఫా అసలు పేరు మహమ్మద్ హనీఫా. 1951 ఏప్రిల్ 22 వ తేదీన కొచ్చిన్ లో జన్మించాడు. ఇక వాళ్ళ అమ్మ పేరు హజీరా, నాన్న పేరు  కొచ్చి వెల్దేదతు థరవట్టిల్ ఎబి మహ్మద్.. ఈయన తన విద్యాభ్యాసం కొచ్చి సెయింట్ అగస్టీన్ స్కూల్ అలాగే సెయింట్ ఆల్బర్డ్స్ కాలేజీ లో పూర్తి చేశాడు .ఇక కామర్స్ లో పట్ట అందుకున్నాడు. ఇక ఈయన ఫసిలాను వివాహం చేసుకుని , వీరికి ఇద్దరు కవలలు కూడా జన్మించారు.

ఇక ఈయన ప్రముఖ కామెడీ కి సంబంధించిన కొచ్చిన కళాభవన్ లో సభ్యులుగా కూడా పనిచేశాడు. ఇక ఆ తర్వాత దాదాపుగా మూడు వందల చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో నటించిన సూత్రధారులు సినిమాకు రెండవ ఉత్తమ నటుడు అవార్డు కూడా లభించింది. ఎన్నో సినిమాల్లో కూడా అవార్డులు లభించాయి. ఇక చివరిగా ఈయన శరీరంలో అవయవాలు పని చేయకపోవడంతో, 2010 ఫిబ్రవరి 2వ తేదీన శ్రీరామచంద్ర ఆస్పత్రిలో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: