స్మరణ: ప్రభుత్వ ఉద్యోగం వదిలి నాటకాల్లో ప్రవేశించిన మాడా వెంకటేశ్వరరావు..

Divya
మన సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు మొదట ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగులుగా చేరి ,vఆ తర్వాత నటన మీద ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో మాడా వెంకటేశ్వరరావు కూడా ఒకరు. నటన మీద ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని వదిలేసి, నాటకాలలోకి ప్రవేశించారు. మాడా వెంకటేశ్వరరావు నపుంసక పాత్రలకు పెట్టింది పేరు. ఈయన గురించి మనకు తెలియని విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మాడా వెంకటేశ్వరరావు.. 1950 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం అనే గ్రామంలో జన్మించారు. ఇక ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే ముగిసింది. ఇక తర్వాత ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ విద్యుత్ విభాగంలో ఉప సాంకేతిక అధికారిగా ఉద్యోగం సాధించారు. పలు నాటకాలలో రంగస్థల నటుడిగా కూడా నటించాడు. ఈయన ఒక పక్క ఉద్యోగం చేస్తూనే, మరోపక్క నాటకాలలో నటించేవాడు. అయితే ఎలాగైనా సరే సినిమాల్లోకి ప్రవేశించాలనే తపనతో, ఉద్యోగానికి రాజీనామా చేసి , 1973 వ సంవత్సరంలో "మాయదారి మల్లిగాడు" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
1975లో వచ్చిన ముత్యాల ముగ్గు, 1978 వ సంవత్సరంలో వచ్చిన చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఈ రెండు చిత్రాలలో కూడా ఏంది బాయ్యా..! అనే డైలాగుతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు మాడా వెంకటేశ్వరరావు. ఆ తర్వాత లంబాడోళ్ళ రాందాసు, సఖియా, శివయ్య వంటి పలు చిత్రాలలో నటించి, తనకంటూ మంచి గుర్తింపు పొందారు మాడా. ఒకసారి  2012వ సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీన ఆదివారం రోజు ఆయనకు అనంతపురం జిల్లాలో అనంత కళావాహిని సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా, ఆయనకు స్వర్ణ కంకణ ధారణ జరిపి, అభినయ కళానిధి అనే బిరుదును కూడా అందించడం జరిగింది.

2013లో ఉగాది పురస్కారాలను కూడా హైదరాబాదులో ఆయన అందుకున్నారు. ఎన్నో బిరుదులు, మంచి గుర్తింపు పొందిన మాడా వెంకటేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చివరికి హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చేరి, అక్కడ కొంతకాలం చికిత్స పొంది , 2017 వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన రాత్రి సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: