స్మరణ : కోడి రామకృష్ణ జీవిత విశేషాలు..

Divya

మంచి క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కోడిరామకృష్ణ , 1949 జూలై 23 వ తేదీన నరసింహమూర్తి - చిట్టెమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఈయన తన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు మొత్తం పాలకొల్లులోనే చదివారు. కళాశాలలో చదువుతున్న సమయంలో చిత్రకళ వృత్తిని చేపట్టి, పగలు చదువుకోవడం, రాత్రిపూట  అజంతా పెయింటింగ్స్ అనే  కమర్షియల్ పెయింటింగ్ షాపు ను కూడా నిర్వహించేవారు. ఆయనకు చిత్రాలలోకి ప్రవేశించాలనే కోరికతో, తన గురువు నాగేశ్వరరావుతో ఫోటోలు తీయించి,ఆ ఫోటోలను , సినిమాలలో  నటించే అవకాశం కోసం దర్శకులకు పంపించే వాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి.."  మన వంశంలో ఇప్పటివరకు ఎవరు డిగ్రీ చదవలేదు. నీవు డిగ్రీ చేయాలన్నది నా కోరిక. నీవు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నీకు  ఏం చేయాలి అనిపిస్తే, అది చేయి , అని చెప్పడంతో సినిమా ప్రయత్నాలు అన్నీ పక్కన పెట్టి, డిగ్రీ పూర్తి చేశాడు కోడి రామకృష్ణ.

మొదట నాటకాలలో నటించాడు. ఆ తర్వాత దాసరి నారాయణరావు తొలి చిత్రమైన తాతా-మనవడు సినిమా చూసి,కోడి  రామకృష్ణ బాగా ఇన్స్పైర్ అవ్వడం కూడా జరిగింది. ఇక దాసరి నారాయణ రావు గారితో మాట్లాడి , ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. దాసరి నారాయణరావు అప్పట్లో ఒకేసారి రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించే వారు. స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు ,ఎవరికి వారే యమునా తీరే వంటి  సినిమాలకు  కోడి రామకృష్ణ ను అసిస్టెంట్  డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇక మొదటి సారి దర్శకుడిగా కోడి రామకృష్ణ "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" అనే  సినిమాను  1981లో దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు నటుడిగా కూడా కొన్ని చిత్రాలలో నటించడం విశేషం. ఇక మరికొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.
ఇక అమ్మోరు సినిమాకు దర్శకత్వం వహించి, సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ తర్వాత అరుంధతి చిత్రానికి కూడా దర్శకత్వం వహించి, అనుష్కను దేశవ్యాప్తంగా గుర్తించేలా చేసి, అవార్డులను కూడా అందుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి, వారి సినీ కెరీర్ ని మలుపు తిప్పాడు. మొత్తం 10 నంది అవార్డులను, రెండు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు 2012 లో  రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని కూడా అందుకోవడం విశేషం.
ఇక చివరిగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడంతో గచ్చిబౌలిలో ఏ ఐ జీ హాస్పిటల్ లో చేరారు. ఇక అలా  చికిత్స పొందుతూ 2019 ఫిబ్రవరి 22న స్వర్గస్తులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: